elder woman feeding husband:నిజమైన ప్రేమంటే ఇదే, భర్తకు తినిపిస్తోన్న భార్య
elder woman feeding husband:ఓ వృద్దురాలు తన భర్తకు ఆప్యాయంగా అన్నం తినిపిస్తోంది. ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అవుతుంది. నిజమైన ప్రేమ అంటే ఇదే మరీ అని కామెంట్స్ చేస్తున్నారు.
elder woman feeding husband:పెళ్లిలో భార్య భర్తలతో (wife and husband) కడవరకు తోడుంటానని ప్రమాణం చేయిస్తారు. అగ్ని సాక్షిగా ప్రమాణం చేస్తారు. సనాతన హిందు సాంప్రదాయంలో కొందరు ఆచరించే పనులు మిగతావారికి ఆదర్శంగా నిలుస్తాయి. భార్య/ భర్త ఎవరికీ బాగోలేకున్నా.. మంచి చెడులు చూసుకోవాలి. అలా ఈ జంట (couple) ఉంటున్నారు. వృద్ద భర్త.. భార్య అప్యాయతను పంచుతూ అన్నం తినిపిస్తోంది.
వీడియోను (video) ఇన్ స్టాలో యానిమేటర్ అబా జియన్ షేర్ చేశారు. ఇప్పటికే 11.7 మిలియన్ వ్యూస్ (11.7 million views) రాగా.. 1.2 మిలియన్ లైక్స్ (1.2 million likes) వచ్చాయి. వారిద్దరి ప్రేమ (love), అన్యోన్యత గురించి చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. తన భర్తకు అప్యాయంగా అన్నం తినిపిస్తోందని రాసుకొచ్చారు. ఇదీ నిజమైన ప్రేమ (true love) అని కొందరు.. జీవిత భాగస్వామిని ఇలా వెతుక్కోవాలని మరికొందరు అభిప్రాయ పడుతున్నారు.
ఆ దంపతులది నిజమైన ప్రేమ (love).. ఏ కల్మషం లేని లవ్ అని అంటున్నారు. కష్టకాలంలో కూడా ఒకరికొకరు అండగా నిలిచారని.. ఎత్తు, పళ్లల్లో కూడా మేమున్నాం అని భరోసా ఇచ్చారని పేర్కొన్నారు. వీడియోకు (video) కామెంట్ల వరద పారుతోంది. తనకు కూడా ఇలాంటి భాగస్వామి కావాలని.. తనపై అమిత ప్రేమను చూపాలని ఒకరు రాశారు. ప్రేమను (love) పొందేవారు అదృష్టవంతులు అని చెప్పారు. ఏదో ఒకరోజు వారు లేకుంటే ఆ బాధ వర్ణణాతీతం అని కామెంట్ చేశారు. ఆ భగవంతుడి వీరిపై కృపను చూపుతామని మరొకరు రాశారు. ఇదీ స్వచ్చమైన ప్రేమ అని మరొకరు అభిప్రాయపడ్డారు.
ఈ రోజుల్లో అన్ని కమర్షియల్.. కొందరు భార్య (wife), భర్తలు (husband) పట్టుమని పదేళ్లు కూడా కలిసి ఉండటం లేదు. చిన్న గొడవను ఇష్యూ చేస్తుంటారు. అన్ని ఇళ్లలో ఇలాంటి సమస్య ఉంటుంది. కానీ ఓపికతో ఎదుర్కొనేవారు చాలా తక్కువ మంది ఉన్నారు. అందుకే మలి వయసులో ఆ వృద్దురాలు తన భర్తపై చాటిన మమకారం.. ప్రతీ ఒక్కరికీ కనువిప్పు కలుగజేస్తోంది. తన కన్నా.. భర్తే ముఖ్యం అని.. చంటి పిల్లాడిలా అతనికి తినిపిస్తోంది. అతను కూడా అంతే అప్యాయతను ఆమెపై చూపిస్తాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. మరెందుకు ఆలస్యం.. మీరు కూడా ఆ వీడియోను చూసేయండి.