ఏడో తరగతి విద్యార్థి తనతోటి ఉన్న 66 మంది విద్యార్థుల ప్రాణాలను కాపాడాడు. స్కూలు డ్రైవర్(School Bus Driver) అకస్మాత్తుగా అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో ఆ విద్యార్థి బస్సును కంట్రోల్ చేశాడు. దీంతో పెద్ద ప్రమాదం నుంచి విద్యార్థులు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ సంఘటన అమెరికాలోని మిచిగాన్ లో చోటుచేసుకుంది. ప్రస్తుతం స్కూలు విద్యార్థి బస్సును ఆపరేట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్(Video Viral) అవుతోంది.
బస్సులోని 66 మందిని కాపాడిన విద్యార్థి వీడియో:
స్కూల్ బస్సు డ్రైవర్(School Bus Driver) అస్వస్థతకు గురవ్వడంతో ఏడో తరగతి చదువుతున్న విద్యార్థి డిల్లాన్ రీవ్స్ స్టీరింగ్ వీల్ ను హ్యాండిల్ చేశాడు. బస్సును కొంత దూరంలో సురక్షితంగా ఆపడంతో విద్యార్థులు సురక్షితంగా బయటపడ్డారు. బాలుడు బస్సును హ్యాండిల్ చేస్తూ తన తోటి విద్యార్థులకు 911కి కాల్ చేయమన్నాడు. ఆ సమయంలో విద్యార్థులంతా భయంతో అరుస్తూ ఉండటం వీడియోలో వినిపిస్తుంది.
డ్రైవర్(School Bus Driver) తనకు ఆరోగ్యం బాగోలేదని అధికారులకు వాకీటాకీలో చెప్పిన కొద్ది సేపటికే కుప్పకూలడంతో విద్యార్థులు ఆందోళన చెందారు. డ్రైవర్ స్పృహ కోల్పోవడాన్ని డిల్లాన్ రీవ్స్ గమనించాడు. వెంటనే డ్రైవర్ దగ్గరికి వచ్చి స్టీరింగ్ ను పట్టుకుని ఆపరేట్ చేయడం మొదలు పెట్టాడు. బస్సులోని 66 మంది విద్యార్థులు ప్రమాదం బారిన పడకుండా ఆపాడు. విద్యార్థి సమయస్ఫూర్తికి అందరూ అభినందించారు. డిల్లాన్ కు స్కూల్ మొత్తం సెల్యూట్ చేసి ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం విద్యార్థి బస్సు ఆపిన వీడియో నెట్టింట వైరల్(Video Viral) అవుతోంది.