Venky : ప్రముఖ ఓటిటిపై వెంకీ సీరియస్! : నిజమే.. ఎన్నడు లేని విధంగా ప్రముఖ ఓటిటి దిగ్గజం నెట్ ఫ్లిక్స్ పై సీరియస్ అయ్యారు సీనియర్ హీరో వెంకటేష్. అసలు వెంకీకి ఓటిటికి ఏంటి ఏంటి సంబందం.. ఎందుకు సీరియస్ అయ్యాడు, అనే వివరాల్లోకి ఓసారి వెళితే.. ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్ అందించడంలో నెట్ ఫ్లిక్స్ ముందు వరుసలో ఉంటుంది.
నిజమే.. ఎన్నడు లేని విధంగా ప్రముఖ ఓటిటి దిగ్గజం నెట్ ఫ్లిక్స్ పై సీరియస్ అయ్యారు సీనియర్ హీరో వెంకటేష్. అసలు వెంకీకి ఓటిటికి ఏంటి ఏంటి సంబందం.. ఎందుకు సీరియస్ అయ్యాడు, అనే వివరాల్లోకి ఓసారి వెళితే.. ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్ అందించడంలో నెట్ ఫ్లిక్స్ ముందు వరుసలో ఉంటుంది. ఈ నేపథ్యంలోనే వెంకటేష్ మరియు రానాతో కలిసి.. ‘రానా నాయుడు’ అనే వెబ్ సిరీస్‌ను తెరకెక్కిస్తోంది. అయితే ఈ సిరీస్ షూటింగ్ ఎప్పుడో కంప్లీట్ అయిపోయింది. అయినా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే విషయంలో క్లారిటీ లేదు. ఆ మధ్య టీజర్ రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. అందులో చాలా డిఫరెంట్ లుక్‌లో కనిపించారు వెంకటేష్. రానా, వెంకీ తండ్రి కొడుకులుగా నటించినట్లు కనిపించింది. దాంతో దగ్గుబాటి అభిమానులు ఎప్పటి నుంచో ఈ సీరీస్ కోసం వెయిట్ చేస్తున్నారు. అయితే ఎట్టకేలకు వార్నింగ్ వీడియోతో ప్రమోషన్స్ స్టార్ట్ చేశాడు వెంకీ. ‘నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు నెట్‌ఫ్లిక్స్. రానా నాయుడు సిరీస్‌లో హీరో ఎవరు, నేను. అందరికంటే పెద్ద స్టార్ కూడా నేనే. అందంగా ఉంది కూడా నేనే. ఫ్యాన్స్ కూడా నాకు సంబంధించిన వాళ్లే. కాబట్టి ఈ సిరీస్‌కు రానా నాయుడు అని కాదు ‘నాగా నాయుడు’ అనే పేరు ఉండాలి..’ అని వెంకటేష్ వార్నింగ్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇకపోతే బాబాయ్, అబ్బాయ్ కలిసి నటిస్తోన్న తొలి వెబ్ సిరీస్ ఇదే. మరి దగ్గుబాటి హీరోలు ఈ సిరీస్‌తో ఎలా ఆకట్టుకుంటారో చూడాలి.