భారత్ సరిహద్దు లోకి 300 మంది ఉగ్రవాదులు (300 Terrorists) ప్రవేశించారు. దాయాది దేశం సరిహద్దుల గుండా ఉగ్రవాదులను పంపేందుకు సిద్ధమైంది. సరిహద్దుల నుంచి ఉగ్రవాదులను ఇండియాలోకి పంపి తమ కార్యకలాపాలను నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో నిఘా వర్గాల హెచ్చరికతో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) అప్రమత్తమైంది. దాదాపుగా 250 నుంచి 300 మంది ఉగ్రవాదులు పాక్ సరిహద్దు నుంచి జమ్మూ కశ్మీర్ లోకి చొరబడేందుకు ప్రణాళికలు వేస్తున్నట్లు బీఎస్ఎఫ్ తెలిపింది.
బీఎస్ఎఫ్ (BSF) ఉన్నతాధికారి ఒకరు ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఉగ్రవాదులు సరిహద్దుల్లోని లాంచ్ ప్యాడ్ లో దాక్కుని ఉన్నారని బీఎస్ఎఫ్కు సమాచారం వచ్చినట్లు తెలిపింది. దీంతో భద్రతా బలగాలను కూడా అప్రమత్తం చేసినట్లు తెలిపింది. సరిహద్దు చొరబాటు ప్రయత్నాలను బీఎస్ఎఫ్ భగ్నం చేస్తుందని ఉన్నతాధికారి వెల్లడించారు.
దక్షిణ కశ్మీర్లోని పుల్వామా జిల్లాలో బీఎస్ఎఫ్ ఇన్స్పెక్టర్ జనరల్ అశోక్ యాదవ్ లాంచ్ప్యాడ్ల వద్ద 250 నుంచి 300 మంది ఉగ్రవాదులు ఉన్నారని తెలియజేశారు. తమకు నిఘావర్గాల నుంచి సమాచారం వచ్చినట్లు తెలిపారు. సైన్యం సున్నితమైన ప్రాంతాలపై ఆధిపత్యం చెలాయించినట్లు స్పష్టం చేశారు. బీఎస్ఎఫ్, ఆర్మీకి చెందిన జవాన్లు సరిహద్దుల్లో అప్రమత్తంగా ఉన్నారని, చొరబాటు ప్రయత్నాలు విజయవంతంగా అడ్డుకుంటామని ఆయన వెల్లడించారు.