బెంగళూరుకు చెందిన ‘స్టాక్ గ్రో’ కంపెనీ ఈ ఆఫర్ ఇచ్చింది. ఈ మేరకు లింక్డిన్లో పోస్ట్ చేసింది. ఈ జాబ్ (job) కోసం ఔత్సాహికులు దరఖాస్తు చేయడమే కాదు.. అలాంటి వ్యక్తిని రిఫర్ చేసిన సరే సర్ ప్రైజ్ (surprise) గిప్ట్ (gift) ఇస్తోంది కంపెనీ. ఐప్యాడ్ (i-pad) ఇస్తామని కంపెనీ చెబుతోంది. వర్తమాన అంశాలపై సెటైరికల్ మీమ్స్ రూపొందించాలి. తయారుచేసే మీమ్ (meme) మనం మాత్రమే నవ్వుకునేలా ఉండకూడదు. కంపెనీ బ్రాండ్ కూడా వెళ్లాలి అని పేర్కొంది.
యువత (youth) కొత్త విషయాలను మీమ్స్ ద్వారా తెలుసుకుంటున్నారని ఆ సంస్థ పేర్కొంది. చీఫ్ మీమ్స్ ఆఫీసర్‌గా నియమించుకునేందుకు సిద్ధమయ్యామని చెప్పుకొచ్చింది. సో ఎందుకు ఆలస్యం.. సృజనాత్మక ఉన్న యువత.. ఈ జాబ్‌కు అప్లై చేసుకొని.. జాబ్ పట్టండి.