అమెరికాలో ఓ సెక్స్ వర్కర్ చేసిన నిర్వాకం ... వేలాది మందిని కలవరానికి గురిచేస్తోంది. HIV వ్యాధి సోకిందని తెలిసినప్పటికీ ఆమె దాదాపుగా 211 మందితో సెక్స్‌లో పాల్గొంది. విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. హెల్త్ అలర్ట్ జారీ చేశారు.
Viral News: అమెరికాలో ఓ సెక్స్ వర్కర్ చేసిన నిర్వాకం … వేలాది మందిని కలవరానికి గురిచేస్తోంది. HIV వ్యాధి సోకిందని తెలిసినప్పటికీ ఆమె దాదాపుగా 211 మందితో సెక్స్‌లో పాల్గొంది. విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. హెల్త్ అలర్ట్ జారీ చేశారు. ఆమెతో సెక్స్‌లో పాల్గొన్న వారు వెంటనే ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఈ అంశం ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
అమెరికాలో లిండా ఇనెజ్ అనే పేరు గల వేశ్యను మే 14న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. HIV వ్యాధి సోకిందని తెలిసినప్పటికీ ఆమె 211 మందితో సెక్స్‌లో పాల్గొన్న విషయాన్ని పోలీసులు బయటపెట్టారు. ఓహియో రాష్ట్రంలో వాషింగ్టన్ కౌంటీ షెరీఫ్ చీఫ్ డిప్యూటీ ఆఫీసర్ మార్క్ వార్డెన్ ఈ విషయం వెల్లడించారు. సెక్స్ వర్కర్‌తో కలిసిన 211 మందిని వెతికి పట్టుకునే పనిలో పోలీసులు ఉన్నట్లు మార్కె వార్డెన్ తెలిపారు. ఆమె ఉపయోగించిన ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు….వాటిలో లభించిన ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసి విచారణ చేస్తున్నారు. తాను విచారణ చేపడుతున్న విషయం తెలిసి..ఎవరూ భయభ్రాంతులకు గురి కావలసిన అవసరం లేదని మార్క్ మార్డెన్ స్పష్టం చేశారు. లిండాతో సెక్స్‌లో పాల్గన్నవారంతా దొరికితే వారి ఆరోగ్యానికి ఎటువంటి హానీ జరగకుండా చూసే బాధ్యత తమదని పోలీసులు భరోసా ఇస్తున్నారు.
పోలీసులు ఏర్పాటు చేసిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఆరోగ్యశాఖ డైరెక్టర్ కూడా పాల్గొన్నారు. HIV లక్షణాలు బయటపడాలంటే కనీసంలో కనీసం 18 నుంచి 90 రోజుల వ్యవధి పడుతుందని తెలిపారు. తాము HIV బారిన పడిన విషయం చాలా మందికి తెలియదని కూడా హెల్త్ డైరెక్టర్ తెలిపారు. ఒక వారం నుంచి ఆరు వారాల పాటు ఇన్క్యూబేషన్ పీరియడ్ ఉంటుందని కూడా హెల్త్ డైరెక్టర్ తెలిపారు. HIV సోకుతుందేమోనని అనుమాన పడేవారు తమని మొహమాట పడకుండా సంప్రదించాలని హెల్త్ డైరెక్టర్ సూచించారు. ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా అందుబాటులో ఉంచారు. ఆ నెంబర్‌కు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవాలని సూచించారు.
ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ కేసులో విచారణ కొనసాగిస్తామని పోలీసులు స్పష్టం చేశారు. 2022 జనవరి 1 ఈ ఏడాది మే 14 వరకు లిండా ఇనెజ్ .. సెక్స్‌లో పాల్గన్న వారందరి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. జరిగిన దాంట్లో బాధితుల ప్రమేయం ఏమీ లేదని, వారు భయం చెందాల్సిన అవసరం లేదని మరోసారి పోలీసులు స్పష్టం చేశారు. తమ నుంచి ఫోన్ కాల్స్ వచ్చినంత మాత్రాన ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారిని స్థానికంగా ఉండే ఆసుపత్రుల్లో చేర్చి చికిత్స అందిస్తామని, HIV టెస్టు చేయిస్తామని పోలీసులు అధికారులు, వైద్యాధికారులు క్లారిటీ ఇచ్చారు.