Rat catching job: అమెరికాలో ఎలుకలు పట్టే జాబ్.. కోట్లలో జీతం!
ఎలుకల బెడదనుంచి తప్పించుకోవడానికి అమెరికాలోని న్యూయార్క్ పట్టణంలో తాజాగా ర్యాట్ క్యాచర్ జాబ్‌ను నియమించారు. ఎలుకలు పట్టే జాబ్ అని తక్కువ అంచనా వేయకండి జీతం ఎంతో తెలిస్తే అవాక్కవుతారు.
Rat catching job: ఎలుకల బాధ గురించి తెలియాలంటే రైతులను అడగాలి. వాటిని పట్టడానికి చాలా రకాల ఎత్తుగడలు వేస్తారు. అలాగే ఇల్లలోని ఎలుకల బాధ కూడా దారుణంగా ఉంటుంది. విదేశాల్లో ఈ బాధ మరీ ఎక్కువగా ఉంటుంది. అందుకే వారు ఎలుకలను పట్టడానికి ప్రత్యేక పద్దతులు వాడుతారు. అయినా సరే వాటిని అరికట్టలేకపోతున్నారు. తాజాగా న్యూయార్క్ సిటీలో ఎలుకలను పట్టేందుకు ర్యాట్ క్యాచర్ అని ఒక ఉద్యోగాన్ని ఏర్పాటు చేశారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎలుకల తాకిడికి అక్కడి ప్రజలు ఎంతలా బేంబేలిత్తిపోతున్నారో.
న్యూయార్క్ నగరంలోని సబ్ వేలు, డ్రైనేజీలు, పార్కులు ఎక్కడ చూసినా ఎలుకలు కుప్పలుగా ఉన్నాయి. ఇటీవల ఎలుకల గురించి వార్తలు కూడా వచ్చాయంటే స్థానికుల బాధ ఎలాంటిదో ఊహించవచ్చు. అందుకే సిటీ మేయర్ ర్యాట్ క్యాచర్‌ను నియమించారు. ఈ ఉద్యోగం కోసం 900 అప్లికేషన్లు వస్తే అందులో ఒకరిని సెలెక్ట్ చేశారు. వారికి సంవత్సరానికి రూ. 1.2 కోట్లను జీతంగా అందిస్తున్నారు. దీనికోసం ‘డైరెక్టర్ ఆఫ్ రోడెంట్ మిటిగేషన్’ పేరిట ఎలుకలను నియంత్రించే ఉద్యోగానికి వచ్చిన దరఖాస్తులో కేథలిన్ కొరాడీని ఎంపిక చేశారు. ఆమె ఓ స్కూలో టీచర్‌గా పనిచేస్తున్నారు. అంతేకాకుండా ఎలుకల నియంత్రణపై పరిశోధన కూడా చేశారు. వాటికి నీళ్లు, ఆహారం దొరక్కుండా చేయడం చేస్తే వాటి సంతతి క్రమంగా తగ్గిపోతుంది. అక్కడి ప్రభుత్వం నిబంధనల ప్రకారం ఎలుకలకు విషం పెట్టి చంపొద్దు. అలా చేస్తే చనిపోయిన విషం ఎలుకను ఇతర జంతువులు తిని అవి చనిపోతాయి అని అధికారులు చెబుతున్నారు. కేవలం వాటిని క్రమంగా తగ్గించే పద్దతిలో కేథలిన్ కొరాడీ పనిచేయనున్నట్లు తెలుస్తుంది.