RSS chief Mohan Bhagwat's key comments on reservations
Mohan Bhagwat: ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సంఘ్ పరివార్ మొదటి నుంచి భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తుందని, రాజ్యాంగం నిర్ధేశించిన అన్ని రిజర్వేషన్లకు మద్దుతగా నిలుస్తోందని వెల్లడించారు. ఆర్ఎస్ఎస్ రిజర్వేషన్లకు ప్రతికూలమని కొంత మంది సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్ఎస్ఎస్ రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. చాలా వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తున్నారని అవన్ని అవాస్తమని చెప్పారు. అవసరమైనంత కాలం వాటిని కొనసాగించాలని, దేశాన్ని అభివృద్ది వైపు నడిపించాలని చెప్పారు.
ఆర్ఎస్ఎస్ ఎప్పుడూ రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదని, వీటిని ఎవరు నమ్మొద్దని అన్నారు. గత కొంత కాలంగా బీజేపీకి 400 ఎంపీ సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తుందని, రిజర్వేషన్లను తీసేస్తుందనే ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ పై కూడా కొన్ని వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో రిజర్వేషన్లు మార్చేది లేదని బీజేపీ చెబుతూ వస్తుంది. కానీ కాంగ్రెస్తో సహా ఇతర పార్టీలన్నీ బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యంగానికి ముప్పు వాటిల్లుతుందనే ప్రచారాన్ని కొనసాగిస్తున్నాయి.