Rashmi: కామెడీ షోలకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. దీంతో స్కిట్ రైటర్స్ రాతలకు హద్దు అదుపు లేకుండా పోతుంది. డబుల్ మీనింగ్ మాటలు, కుళ్లు కామెడీతో నవ్వులు తెప్పిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఇబ్బందులకు కూడా గురిచేస్తున్నారు. ఈటీవీలో టెలికాస్ట్ అవుతోన్న బబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ ఆ కోవలోకి చెందుతాయి. ఆ తర్వాత శ్రీదేవి డ్రామా కంపెనీ పేరుతో మరో షో చేస్తున్నారు. ఇందులో కూడా జబర్దస్త్లో స్కిట్ చేసే వారు ఉన్నారు.
షోకు ఇంద్రజ (indraja) జడ్జీగా వ్యవహరిస్తున్నారు. ఒక ఎపిసోడ్లో రాం ప్రసాద్ (ram prasad)- రష్మి (Rashmi) మధ్య డైలాగ్ ఉంటుంది. అందులో రాం ప్రసాద్ ఏకంగా రాత్రికి వస్తావా అనే అర్థం వచ్చేలా మాట్లాడతాడు. అందుకు రష్మీ (Rashmi) కూడా రియాక్ట్ అవుతూ.. ఎందుకు రావాలని అడుగుతుంది. రాత్రికి ఎందుకు రమ్మంటారో తెలియదా అని ఆన్సర్ ఇచ్చాడు. రాం ప్రసాద్ మాటలను చూసి సెట్లో ఉన్న వారంతా షాక్ తింటారు. జడ్జీ ఇంద్రజ (indraja) రియాక్ట్ అవుతూ.. ఏయ్ అనే సరికి రాం ప్రసాద్ తేరుకుంటాడు. తర్వాత ఏదో కవర్ చేస్తాడు.
ఆ షోకు సంబంధించి ప్రోమో వదలగా.. చర్చకు దారితీసింది. ఇదేంటి ఇంత బరితెగించి కామెంట్ చేయడం చేయడం అని ప్రతీ ఒక్కరు ముక్కున వేలు వేసుకుంటున్నారు. ఏదో కామెడీ కోసం చూస్తుంటే.. ఇలా చేయడం ఏంటీ అని చర్చించుకుంటున్నారు. నిజమే.. కామెడీ కోసం చూసే షోలో.. ఇలాంటి కామెంట్స్ చేయడం సరికాదు. ఇలాంటి స్కిట్ వల్ల ఆ షో.. చానెల్ పేరు చెడిపోతుంది. ఇప్పుడు వస్తోన్న రేటింగ్ కూడా రాకపోవచ్చు.