బుల్లితెరపై హాట్ యాంకర్‌గా ఉన్న రష్మీ గురించి అందరికీ తెలిసిందే. ఈ ముద్దుగుమ్మ ఇచ్చే హాట్ కంటెంట్ మామలూగా ఉండదు. షోలో మాత్రమే కాదు.. సినిమాల్లోను అమ్మడు రెచ్చిపోయింది. ఇక సుడిగాలి సుధీర్‌తో రష్మీ రొమాన్స్ ఓ రేంజ్లో ఉంటుంది. ఈ ఇద్దరి మధ్య అసలు ఏముందో తెలియదు గానీ.. ఈ ఇద్దరు ఎప్పుడు హాట్ టాపికే. అయితే తాజాగా ఈ బ్యూటీని బిగ్ బాస్ కోసం సంప్రదించగా భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది.
ఆన్ స్క్రీన్‌లో సుడిగాలి సుధీర్, యాంకర్ రష్మీ(Rashmi) రొమాన్స్ చూసి.. ఆఫ్ స్క్రీన్‌లోను ఈ ఇద్దరు ప్రేమలో ఉన్నారని గట్టిగా నమ్ముతున్నారు జనాలు. కానీ ఈ విషయంలో ఎప్పుడు ఓపెన్ అవడం లేదు సుధీర్, రష్మీ. అయినా ఈ ఇద్దరి జోడి బుల్లితెర పై కనిపిస్తే.. ఆ షో బ్లాక్ బస్టర్‌గా నిలుస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఈ ఇద్దరిని బుల్లితెర హీరో హీరోయిన్లని చెప్పొచ్చు. ఇక ప్రత్యేకంగా రష్మీ గురించి చెప్పాలంటే.. అమ్మడు పలు క్రేజీ షోలతో బుల్లితెరను షేక్ చేస్తోంది. ఒక్కో షోకి రష్మి గౌతమ్ రూ.1.5 నుంచి 2 లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటుందనే టాక్ ఉంది. అలాంటి ఈ బ్యూటీ బిగ్ బాస్ హౌజ్‌కి వెళ్లాలంటే గట్టిగా సమర్పించుకోవాల్సిందే.
అందుకే బిగ్ బాస్ అప్ కమింగ్ సీజన్ కోసం(remuneration) భారీగా డిమాండ్ చేసిందట అమ్మడు. ఇప్పటికే వరకు తెలుగు బిగ్ బాస్ రియాల్టీ షో ఆరు సీజన్లు కంప్లీట్ చేసుకుంది. అయితే చివరగా నాగార్జున హోస్ట్‌గా వచ్చిన ఆరో సీజన్ ఓటిటిలో స్ట్రీమింగ్ అయింది. దాంతో ఈ సీజన్ అట్టర్ ఫ్లాప్‌గా మిగిలింది. ఇందులో పాల్గొన్న కంటెస్టెంట్ ఎవరికి తెలియకపోవడంతో.. తేడా కొట్టేసిది. అందుకే ఏడో సీజన్‌తో మరోసారి సత్తా చాటాడానికి ట్రై చేస్తున్నారు బిగ్ బాస్ నిర్వాహకులు. ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్‌గా హంట్ జరుగుతోంది. ఈక్రమంలో హాట్ బ్యూటీ రష్మీ గౌతమ్‌కు కూడా ఆఫర్ ఇచ్చారట. కానీ రెమ్యూనరేషన్ మాత్రం భారీగా డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది. తను తీసుకునే ఒక్కో షో పారితోషికం ప్రకారం లెక్క చేసి ఇవ్వాలని అడుగుతోందట. ఈ లెక్కన వంద రోజులకు అమ్మడికి గట్టిగానే ఇవ్వాల్సి ఉంటుంది. దాంతో షో నిర్వాహకులు కాస్త ఆలోచిస్తున్నట్టు సమాచారం. మరి ఈసారి రష్మీ గౌతమ్ బిగ్ బాస్ హౌజ్‌లోకి ఎంటర్ అవుతుందేమో లేదో చూడాలి.