»Rain On One Side See The Celebration Of The Mother Carrying Her Daughter On Her Shoulders
Mother love : ఓ వైపు వర్షం.. కూతుర్ని భుజాలపై మోస్తూ తల్లి సంబరం చూడండి
బిడ్డల్ని తల్లిదండ్రులు కంటికి రెప్పలా కాపాడుకుంటారు. అందుకోసం వారు ఎంతటి కష్టాన్నైనా భరిస్తారు. భారీవర్షంలో కాళ్లకి చెప్పులు లేకపోయినా కూతుర్ని భుజాలపై ఎత్తుకుని తీసుకెళ్తున్న ఓ తల్లి వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
అమ్మదనమున ఎంత కమ్మదనం ఉందిరా.. అమృతమ్ముకే ఆమె తీపి నేర్పింది రా.. అన్నారో మహాకవి. సృష్టికర్త అయిన బ్రహ్మను కూడా సృష్టించింది ఓ అమ్మేనని చెప్తారు. అటువంటి అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే. మానవులకు తెలిసిన అన్ని సంబంధాలలో, అన్నిటినీ అధిగమించే ఓ గొప్ప సంబంధం తల్లీబిడ్డ (mother child)ల సంబంధం. సృష్టిలో నిష్కల్మషమైన ప్రేమకు ప్రతిరూపం అమ్మ.సృష్టిలో తల్లి ప్రేమను మించినది ఏది లేదు. పిల్లల కోసం ఎన్నో కష్టాలు భరిస్తారు. తమ ఇష్టాలను కూడా త్యాగం చేస్తారు. భారీ వర్షాన్ని లెక్కచేయకుండా తన కూతుర్ని భుజాలపై మోస్తూ నవ్వుతూ ఇంటికి తీసుకెళ్తున్న ఓ తల్లి వీడియో ఇంటర్నెట్ (Internet) లో వైరల్ అవుతోంది. ఇంటర్నెట్లో కనిపించిన ఓ వీడియో అందరి మనసుల్ని హత్తుకుంది.
18 సెకండ్ల నిడివి ఉన్న ఈ వీడియోని @Masterji_UPWale అనే ట్విట్టర్ యూజర్ (Twitter user) పోస్ట్ చేశారు. వర్షం పడుతోంది. తల్లి కూతురిని భుజాలపై మోస్తున్నట్లు ఆ వీడియోలో కనిపిస్తుంది. కూతురి చేతుల్లో గొడుగు ఉంది. చెప్పాలంటే గొడుగు పట్టుకుని కూతురిని రోడ్డుపై నడిపించవచ్చు. తన కాళ్లకు చెప్పులు లేకపోయినా కూతురితో కబుర్లు చెబుతూ నవ్వుతూ ఇంటికి తీసుకెళ్తున్న ఆ తల్లి ప్రేమ ఎంత గొప్పదో కదా. ఈ వీడియోకి ఇప్పటికే లక్షల్లో వ్యూస్ వచ్చాయి. ‘వీడియో(Video)హృదయాన్ని హత్తుకునేలా ఉందని.. ఆ తల్లి చిరునవ్వులు చూడమని’ కామెంట్లు పెడుతు నెటిజన్లు రెడ్ హార్ట్ (Red heart)ఎమోజీని చూపించారు. బిడ్డలు కబుర్లు చెబుతూ ఉంటే ప్రతి తల్లి తన కష్టాన్నే మర్చిపోతుంది. చిరునవ్వులు చిందిస్తుంది. అందుకు ఈ వీడియో ప్రత్యక్ష నిదర్శనం.