Deepika: దీపికా పదుకొణె, షారుక్ నటించిన పఠాన్ ఈ ఏడాది ప్రారంభంలో ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ అయింది. ఈ మూవీలో దీపికా విన్యాసాలు చేసింది. ముఖ్యంగా బేషరమ్ రంగ్లో గ్లామర్ ఆరబోసింది. ఆమె కాస్ట్యూమ్స్‌పై వివాదాలు కూడా చెలరేగాయి. బాలీవుడ్ చిత్రాలలో అతిపెద్ద బ్లాక్‌బస్టర్‌గా రూపుదిద్దుకుంటున్న పఠాన్ ప్రపంచవ్యాప్తంగా రూ. 1100 కోట్లు రాబట్టింది. ఎన్ని వివాదాలు వచ్చినా, ఈ మూవీ విజయాన్ని ఎవరూ ఆపలేకపోయారు.
తాజాగా దీపిక ఓ ఫోటో షేర్ చేసింది. ఈ మూవీ షూటింగ్ సమయంలో దిగిన ఫోటోని దీపికా షేర్ చేసింది. ఆమె బ్లాక్ అండ్ వైట్ ప్రింటెడ్ బికినీలో ఉండటం విశేషం. ఈ ఫోటో చూసి పాజిటివ్ కంటే, నెగిటివ్ కామెంట్సే ఎక్కువగా రావడం గమనార్హం. ఆ ఫోటో చూసి అందరితోపాటు ఆమె భర్త రణవీర్ సింగ్ కూడా షాకయ్యారట.
స్పెయిన్‌లో పఠాన్ షూటింగ్ నుంచి కనిపించని BTS చిత్రాన్ని దీపిక విడుదల చేసింది. ఆమె బ్లాక్ అండ్ వైట్ ప్రింటెడ్ బికినీ ధరించింది. దీపిక “ఒకప్పుడు… చాలా కాలం క్రితం కాదు. అంటూ క్యాప్షన్ పెట్టింది.” దీపికా ఇన్‌స్టాగ్రామ్‌లో చిత్రాన్ని పంచుకున్న వెంటనే, రణ్వీర్ “హెచ్చరిక చేస్తే బాగుండేది” అని కామెంట్ చేయడం విశేషం. గత కొంతకాలంగా దీపికా, రణవీర్ విడాకులు తీసుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ కామెంట్‌తో వీరు కలిసే ఉన్నారని, విడిపోలేదని క్లారిటీ వచ్చింది.