»Delivery Executive Eating Customers Food Video Viral On Internet
Viral Video: అడ్డంగా దొరికిన డెలివరీ బాయ్
ప్రముఖ ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ సంస్థకు చెందిన ఓ ఎగ్జిక్యూటివ్ కస్టమర్లకు ఇచ్చే ఆహారాన్ని తింటూ కెమెరాలకు అడ్డంగా దొరికాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి మీరు కూడా అతను ఏం చేశాడో చూసేయండి.
Delivery executive eating customer’s food video Viral on Internet
Viral News: ప్రస్తుతం ఒక వీడియో ఇంటర్నెట్(Internet)లో తెగ వైరల్(Viral) అవుతుంది. ప్రౌడ్ టుబి ఇండియన్ అనే ఫేస్ బుక్(FaceBook) పేజీ ద్వారా పోస్ట్ చేసిన ఈ వీడియోలో ఆహరాన్ని సరఫరా చేసే వ్యక్తి కస్టమర్లకు డెలివరి చేసే ఫుడ్‌లో చేయి పెట్టి తింటున్నాడు. ఒక డెలివరీ ఎగ్జిక్యూటివ్ ట్రాఫిక్ సిగ్నల్ పడడంతో వేచి ఉన్నాడు. అంతలో అతను వెనుక క్యారీ బ్యాగ్‌లో చేతి పెట్టి కొంత ఫుడ్ తిసుకొని తిన్నాడు. అక్కడే ఉన్న మరో వ్యక్తి అతను చేస్తున్న పనిని రికార్డు చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది.
అది ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది అనే పూర్తి వివరాలు తెలియవు. కానీ ఆర్డర్ చేసిన వారికి ఇచ్చే ఆహారాన్ని ఇలా తినడం కరెక్ట్ కాదని పలువురు కామెంట్లు(comments) చేస్తున్నారు. ట్రాఫిక్‌లో బైక్ నడుపుకుంటున్న అతని చేతులు అపరిశుభ్రంగా ఉంటాయి. అలా చేతులు పెట్టేసి తిని, మళ్లీ దాన్ని కష్టమర్లకు అందించడం ఒక నేరంగా పరగణిస్తున్నారు నెటిజన్స్. గతంలో కూడా ఒక డెలివరీ బాయ్ ఇలాగే ఫుడ్ తిని వైరల్ అయ్యాడు. తద్వారా తన ఉపాదిని కూడా కోల్పోయాడు. ఇప్పుడు ఈ వీడియోచక్కర్లు కొడుతుంది. ఇలాంటి ఘటన ద్వారా వినియోగదారులు ఏదైనా ఆర్డర్ పెట్టాలంటే భయపడే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అలాగే కస్టమర్ల ఆరోగ్యం దృష్ట్యా కూడా వీటిని ప్రోత్సహించకూడదని ప్రజలు కామెంట్లు పెడుతున్నారు.