నారా లోకేశ్‌కు వైఎస్ షర్మిల క్రిస్మస్ గిఫ్ట్ పంపడంతో ఏపీ రాజకీయాల్లో సర్వత్రా చర్చనీయాంశమైంది. క్రిస్మస్ బహుమతి పంపినందుకు గాను ట్విట్టర్ వేదికగా నారా లోకేశ్ స్పెషల్ థ్యాంక్స్ చెప్పారు.
ఆలయం వద్ద ప్రసాదం తిని ఒకరు మృతి చెందగా మరో 70 మంది పరిస్థితి విషమంగా ఉన్న ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. ప్రస్తుతం ఐసీయూలో మరికొందరు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టగానే మహిళలకు ఫ్రీ బస్ స్కీమ్ చేపట్టిన విషయం తెలిసిందే. దీంతో ఆర్టీసీ బస్సుల్లో రద్దీ పెరిగి.. సీట్లు దొరకడం లేదు. ఈ నేపథ్యంలో సీట్లకోసం మహిళలు దారుణంగా కొట్టుకుంటున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
రెజ్లర్ భజరంగ్ పునియా ఢిల్లీలో తన పద్మశ్రీ అవార్డును వెనక్కి ఇచ్చేస్తున్న వీడియోను భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ షేర్ చేశారు. ఆ వీడియోను చూస్తుంటే హృదయం ముక్కలవుతోందని కామెంట్ చేశాడు. ప్రస్తుతం ఆ వీడియో కాస్తా నెట్టింట వైరల్ అవుతోంది.
సీబీఐ మాజీ జేడీ లక్ష్మి నారాయణ 'జై భారత్ నేషనల్ పార్టీ' పేరుతో కొత్త పార్టీని ప్రారంభించారు. అలాగే నేడు 'తెలుగు సేన పార్టీ' అనే పేరుతో ప్రముఖ సినీ నిర్మాత సత్యారెడ్డి కూడా కొత్త పార్టీని స్థాపించారు.
బ్యాక్టీరియాకు నోబెల్ విజేత, 'విశ్వకవి' రవీంద్రనాథ్ ఠాగూర్ పేరు మీదుగా 'ప్లాంటోయా ఠాగూరై' అని నామకరణం చేసినట్లు విశ్వభారతి యూనివర్సిటీకి చెందిన ఆరుగురు పరిశోధకుల బృందం తెలిపింది.
న్యూయార్క్‌లోని లాగ్వార్డియా విమానాశ్రయంలో ఆందోళనకరమైన కేసు వెలుగులోకి వచ్చింది. ఓ చిన్నారి డైపర్‌లో 17 బుల్లెట్లు లభ్యమయ్యాయి. అకస్మాత్తుగా సెక్యూరిటీ గేటు వద్ద ఉన్న ఎక్స్-రే మిషన్‌లో అలారం మోగడం ప్రారంభించింది. దీని తరువాత, తనిఖీ సమయంలో, ఒక ప్రయాణికుడు పిల్లల డైపర్‌లో దాచిపెట్టిన 17 తుపాకీ బుల్లెట్లను తీసుకువెళుతున్నట్లు గుర్తించగా..అతడిని అరెస్టు చేశారు.
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి మరోసారి ఆందోళన కలిగిస్తున్న తరుణంలో ఆరోగ్య శాఖ అలర్ట్ అయ్యింది.
బిగ్‌బాస్-7 విజేత పల్లవి ప్రశాంత్‌తోపాటు అతని సోదరుడు మహావీర్‌ను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో మరో 16 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
కొత్త వేరియంట్ కలవరపెడుతున్న తరుణంలో ఓ వ్యక్తి కోవిడ్ లక్షణాలతో ఎంజీఎంలో చేరడం హాట్ టాపిక్ గా మారింది. ఆ పేషెంట్‌ను వైద్యులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు.
భారత మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ కుమారుడు సమిత్ అచ్చం తన తండ్రిలానే ఆడుతున్నారని, బ్యాటింగ్ స్టైల్ కూడా అలానే ఉందంటే నెట్టింట ఓ వీడియో ట్రెండ్ అవుతుంది.
అలిపిరి నడకమార్గంలో చిరుత సంచారం కలవరపెడుతోంది. చిరుతను ట్రేస్ చేసి పట్టుకునేందుకు ఫారెస్ట్ అధికారులు ప్రయత్నిస్తున్నారు.
అన్నపూర్ణ స్టూడియో వద్ద జరిగిన అల్లర్ల వెనక పల్లవి ప్రశాంత్ అభిమానుల ప్రమేయం ఉందని పోలీసులు గుర్తించి పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ఏ1గా ఉన్న పల్లవి ప్రశాంత్‌ను అరెస్ట్ చేశారు.
టాలీవుడ్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న గుంటూరు కారం సినిమా నుంచి వీడియో లీక్ అయ్యింది.
అయోధ్యకు 1000 రైళ్లను నడపాలని భారతీయ రైల్వే నిర్ణయించింది. భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లను కూడా చేసింది.