తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అక్కినేని నాగార్జున, అమల దంపతులు మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.
తన భార్య పుట్టింటికి వెళ్లి రావట్లేదని ప్రశాంత్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాంతో అసలు విషయం బయటపడింది. తన భార్య స్నేహకు ఇదివరకే రెండు పెళ్లిళ్లు అయ్యాయని.. తాజాగా మరో వ్యక్తిని పెళ్లి చేసుకొని కాపురం చేస్తుంది. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
విమానాన్ని ట్రక్కుపై తీసుకెళ్తుండగా ఒక బ్రిడ్జి కింద ఇరుక్కుపోయింది. దాంతో జనాలు సెల్ఫీల కోసం ఎగబడ్డారు. రోడ్డు మీద భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.
నంది అవార్డులు ఇవ్వటంపై తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఉగాది నాటికి నంది అవార్డులను ప్రాంతాలకు అతీతంగా ఇస్తామని ప్రకటించారు.
2023 ఏడాదిలో విరాట్ కోహ్లీ అద్భుతమైన రికార్డులను నెలకొల్పాడు. మంచి ఫామ్ తో పరుగుల వర్షం కురిపించాడు.
కోలీవుడ్ స్టార్ హీరో విజయకాంత్ అంత్యక్రియలు ముగిశాయి. కడసారి ఆయన పార్దీవదేహాన్ని చూసేందుకు భారీ సంఖ్యలో జనం తరలివచ్చారు. శుక్రవారం సాయంత్రం ఆయన అంత్యక్రియలను బంధువులు, కుటుంబీకులు పూర్తి చేశారు.
వచ్చే ఐదేళ్లలో 50 శాటిలైట్లను ప్రయోగించనున్నట్లు ఇస్రో ఛైర్మన్ ఎస్.సోమనాథ్ వెల్లడించారు. మరిన్ని ప్రయోగాలను 2024లో చేపట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.
తెలంగాణలో మరో రెండు రోజుల పాటు చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, ఉదయం 8 గంటల వరకూ బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
సన్నబియ్యాన్ని సామాన్యులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంది. భారత్ బ్రాండ్ రైస్ పేరుతో సన్న బిర్యాన్ని కేజీ 25 రూపాయలకే అందించేందుకు సిద్ధమైంది.
తెలుగు చిత్ర పరిశ్రమలోని టాప్ కమెడియన్ బ్రహ్మానందం తన ఆత్మకథను అక్షరరూపంలో మలిచారు. ఆత్మకథ రాసిన సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి స్వయంగా బ్రహ్మానందంను ఇంటికి పిలిచి శాలువాతో సత్కరించారు.
మనుషులకు సాయపడుతాయని రోబోలను తయారు చేస్తే అవి తిరగపడుతున్నాయి. అమెరికాలోని టెక్సాస్‌లోని టెస్లా గీగా ఫ్యాక్టరీలో ఓ రోబో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను గాయపరిచింది.
శబరిమల ఆలయానికి భక్తులు పోటెత్తారు. నేడు ఆలయంలో మండల పూజ నిర్వహించనున్నారు. ఆ పూజ తర్వాత రాత్రి 11 గంటలకు ఆలయ తలుపులను అధికారులు మూసివేయనున్నట్లు ప్రకటించారు. చివరి రోజు కావడంతో శబరిమలకు భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు.
శిఖర్ దావన్ కుమారుడి పుట్టిన రోజు సందర్భంగా అతను సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. తన కుమారుడిని చూసి ఏడాది అవుతుందని పోస్ట్ చేశాడు.
బిగ్ బాస్ యాజమాన్యం ఎండమోల్ షైన్ ఇండియా ప్రయివేట్ లిమిటెడ్‌కు హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పోలీసులు నోటీసులను జారీ చేశారు.
ఏపీ ఎన్నికల్లో జనసేన అభ్యర్థులు పోటీ చేయబోయే నియోజకవర్గాల గురించి పవన్ సమీక్షలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఎన్నికల్లో 25 నుంచి 40 స్థానాల్లో జనసేన అభ్యర్థులు పోటీలో నిలిచే అవకాశం ఉంది. ఈ తరుణంలో పవన్ ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేశారు.