పార్కింగ్ ప్లేస్‌లో ఓ కారుతో యువతి స్టంట్ చేసింది. అది కాస్త ఫెయిల్ అయి ఆ కారు బోల్తా పడింది. ఈ ఘటనలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.
ఢిల్లీ మెట్రోలో ఇద్దరు యువకులు కొట్టుకున్నారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా తెగ వైరల్ అవుతోంది.
ఢిల్లీలో మూడు గంటలకు పైగా ఇండియా కూటమి నేతలు పలు విషయాలపై చర్చించారు. ఈ సమావేశంలో ప్రధాని అభ్యర్థిపై కూడా ప్రధానంగా చర్చలు జరిపి తమ ప్రతిపాదనలను తెలియజేశారు.
బాధ్యత లేకుండా అమెరికా సైనిక కూటమి చేస్తున్న బెదిరింపులను తాను తేలిగ్గా తీసుకోనని కిమ్ చెప్పారు. వసూంగ్-18 ఖండాంతర క్షిపణిని ప్రయోగించి అమెరికా, జపాన్, దక్షిణ కొరియా దేశాలకు కీలక ఆదేశాలిచ్చినట్లుగా మీడియా కథనాలు వెలువడ్డాయి.
కాన్పూర్‌లో ఓ కానిస్టేబుల్ పోలీస్ స్టేషన్‌లోనే దొంగతనానికి పాల్పడుతున్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. గ్వాలాటోలి పోలీస్ స్టేషన్‌లో పోస్ట్ చేయబడిన కానిస్టేబుల్ తన అనుచరుడితో కలిసి పోలీస్ స్టేషన్‌లో స్వాధీనం చేసుకున్న కారు టైర్‌ను దొంగిలించాడని ఆరోపణలు వచ్చాయి.
అన్నంలోకి ఊరగాయ కావాలని తలుపు తట్టాడు. సాయం చేద్దామని తలుపు తెరిచిన మహిళ బుగ్గను కొరికి అత్యాచార యత్నం చేశాడు. కేకలు వేయ్యడంతో భయంతో పారిపోయాడు.
బస్సులో సీటు కాదు.. ఎక్కేందుకు చోటు కూడా లేదని.. ఓ విద్యార్థిని ఏడ్చేసింది. ఈ ఘటన జగిత్యాల జిల్లా కేంద్రంలో జరిగింది. ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా.. తెగ వైరల్ అవుతోంది.
అండర్ వరల్డ్ డాన్‌గా పేరొందిన దావూద్ ఇబ్రహీం అస్వస్థతకు గురై ఆస్పత్రిపాలయ్యారు. ఆయనపై విషప్రయోగం జరిగిందని, ఆయన సన్నిహితులే ఆయనపై విషప్రయోగం చేసినట్లు పాక్ వర్గాల సమాచారం.
ఎల్ఐసీ ఇప్పుడు అద్భుత ఆఫర్లతో క్రెడిట్ కార్డులను అందిస్తోంది. ఈ క్రెడిట్ కార్డులకు ఎటువంటి జాయినింగ్ ఫీజు, అలాగే వార్షిక ఫీజు కూడా లేదని ఎల్ఐసీ తెలిపింది. ఈ కార్డులపై ప్రమాద బీమా కూడా అందిస్తున్నట్లు వెల్లడించింది.
టెస్ట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లియోన్ 500 వికెట్లకు పైగా తీసి రికార్డు నెలకొల్పాడు. ఆస్ట్రేలియా జట్టులో 500కు పైగా వికెట్లు తీసిన మూడో క్రికెటర్‌గా, అంతర్జాతీయ క్రికెట్‌లో 500కు పైగా వికెట్లు తీసిన 8వ క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పాడు.
మంచు లక్ష్మి గురించి టాలీవుడ్ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మోహన్ బాబు కూతురిగా ఇండస్ట్రీకి వచ్చినా.. అతి తక్కువ కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
భారత సరిహద్దులోకి 300 మంది ఉగ్రవాదులు ప్రవేశించడంతో ఆర్మీ అలర్ట్ అయ్యింది. ఉగ్రవాదులను ఎదుర్కొనేందుకు బీఎస్ఎఫ్ బలగాలు సిద్దమయ్యాయి.
ప్రస్తుతం ఏఐ టెక్నాలజి ఎంత దూసుకుపోతుందో అందరికి తెలిసిందే. రాబోయే రోజుల్లో మానవులను పెళ్లి చేసుకొనే విధంగా అవి రూపుదిద్దుకోనున్నాయని నిపుణులు చెబుతున్నారు.
70 ఏళ్ల చరిత్రలో సీతక్క స్వగ్రామానికి బస్సు సౌకర్యం లేదు. అయితే మంత్రిగా సీతక్క అడుగుపెట్టిన తర్వాత ఆ ఊరికి ఆర్టీసీ బస్సు పరుగులు పెట్టింది. ములుగు మండలంలోని సీతక్క స్వగ్రామం అయిన జగ్గన్నపేటతో సహా 8 గ్రామాల మీదుగా వెళ్లేందుకు ఆర్టీసీ బస్సును అధికారులు ఏర్పాటు చేశారు. ఆ బస్సును రోజూ మూడు ట్రిప్పులు నడిపేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. దీంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
2023లో ఆన్‌లైన్‌లో అత్యధికంగా ఆర్డర్ చేయబడిన ఆహారం బిర్యానీ. స్విగ్గిలో వరుసగా ఎనిమిదో సంవత్సరం కూడా అత్యధికంగా ఆర్డర్ చే'సిన ఆహార వస్తువుగా బిర్యానీ నిలిచింది.