»Australias Spinner In The 500 Wicket Club Ashwins Chance
Nathan Lyon: 500 వికెట్ల క్లబ్‌లోకి ఆస్ట్రేలియా స్పిన్నర్..అశ్విన్‌కు ఛాన్స్
టెస్ట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లియోన్ 500 వికెట్లకు పైగా తీసి రికార్డు నెలకొల్పాడు. ఆస్ట్రేలియా జట్టులో 500కు పైగా వికెట్లు తీసిన మూడో క్రికెటర్‌గా, అంతర్జాతీయ క్రికెట్లో 500కు పైగా వికెట్లు తీసిన 8వ క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పాడు.
టెస్ట్ మ్యాచుల్లో 500 వికెట్ల క్లబ్ లోకి ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లియోన్ చేరాడు. పెర్త్ వేదికగా పాకిస్తాన్ జట్టుతో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో లియోన్ ఈ ఘనత సాధించాడు. సుదీర్ఘ ఫార్మాట్లో 500కు పైగా వికెట్ల తీసిన మూడో ఆస్ట్రేలియా బౌలర్‌గా లియోన్ రికార్డుకెక్కాడు. ప్రపంచవ్యాప్తంగా చూస్తే 8వ బౌలర్‌గా ఉన్నాడు. 36 ఏళ్ల లియోన్ 123 మ్యాచుల్లోనే ఈ రికార్డును నెలకొల్పడంతో ఆయన అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ఆస్ట్రేలియా తరుపున టెస్టు క్రికెట్లో 500 వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో లియోన్ మూడో స్థానంలో నిలిచాడు. అతడి కంటే ముందు షేన్ వార్న్ 708 వికెట్లు, గ్లెన్ మెక్‌గ్రాత్ 563 వికెట్లను తీశారు. ఇకపోతే ఓవరాల్‌లో అంతర్జాతీయ క్రికెట్లో ఎనిమిదో ఆటగాడిగా లియోన్ రికార్డుకెక్కాడు. ఇక భారత స్పిన్నర్ రవించంద్రన్ అశ్విన్ కూడా 94 టెస్ట్ మ్యాచులు ఆడి ఇప్పటి వరకూ 489 వికెట్లను పడగొట్టాడు. త్వరలోనే అశ్విన్ కూడా 500 వికెట్ల క్లబ్ లోకి చేరే అవకాశం ఉంది.