»Followers Are Unfollowing On Mumbai Indians Social Media Accounts Due To Change Of Captain Rohit Sharma
Rohit Sharma: ముంబయి ఇండియన్స్ సోషల్ మీడియా అకౌంట్స్ డౌన్
ముంబయి ఇండియన్స్ యాజమాన్యం తీసుకున్న నిర్ణయానికి రోహిత్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఇన్ని సంవత్సరాలు ఆ టీమ్ కోసం ఆడి, ఐదు సార్లు కప్ గెలిపించిన కెప్టెన్‌ను ఎలా మారుస్తారు అని నెట్టింట్లో ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ముంబయి ఇండియన్స్ సోషల్ మీడియా అకౌంట్స్ నుంచి బయటకు వచ్చేస్తున్నారు.
Followers are unfollowing on Mumbai Indians social media accounts due to change of captain Rohit Sharma
Rohit Sharma: ముంబయి ఇండియన్స్ కెప్టెన్ మార్పుపై క్రికెట్ అభిమానులు అసంతృప్తిని కనబరుస్తున్నారు. ఐదు సార్లు కప్ గెలిపించిన కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) స్థానంలో హార్దిక్ పాండ్య(Hardik Pandya)ను తీసుకురావడంతో ఫ్యాన్స్ ఒప్పుకోవడం లేదు. ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా ఈ ఫ్రాంచైజీపై నెగిటివ్ కామెంట్స్ పెడుతూ రచ్చ చేస్తున్నారు. తాజాగా సోషల్ మీడియాలో (Social Media) ముంబయి ఇండియన్స్ హ్యాండిల్స్ నుంచి అన్‌ఫాలో అవుతున్నారు. రోహిత్ శర్మ అభిమానులు మండిపడుతున్నారు.
ముంబయి ఇండియన్స్ అనే ఎక్స్(X) అకౌంట్‌కు గతంలో 8.6 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. ఇప్పుడు ఆ సంఖ్య 8.2 మిలియన్లకు తగ్గింది. సుమారు 4 లక్షల మంది ఫాలోవర్లు అన్‌ఫాలో అయ్యారు. అలాగే ఇన్స్టాగ్రామ్(Instagram)లోనూ 12.8 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉండే ఇప్పుడు 12.7 మిలయన్స్ ఫాలోవర్స్ ఉన్నారు. ఒకవేళ ఈ సీజన్లో రోహిత్ శర్మ ఆడకపోతే మరింతమంది ఫాలోవర్లను కోల్పోయే ప్రమాదం ఉంది. రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించడంతో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.