నేడు రథసప్తమి సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయం భక్తులతో కిక్కిరిసింది. రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని సూర్యభగవానుడి నిజరూప దర్శనాన్ని చూసేందుకు అరసవల్లికి భక్తులు తరలివచ్చారు. శుక్రవారం రాత్రే భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకున్నారు. సూర్యభగవానుడి దర్శనం కోసం విచ్చేసే భక్తులకు ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దర్శనం కోసం క్యూలలో భక్తులు గంటల సేప...
టాక్ షోలలోనే నంబర్ వన్ గా నిలుస్తున్న అన్ స్టాపబుల్-2 షోకు సంబంధించిన మరో ప్రొమో విడుదలైంది. షో హోస్ట్ నందమూరి బాలకృష్ణ తన ప్రశ్నలతో సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ను ఇరకాటంలోకి నెట్టేశాడు. ముఖ్యంగా మూడు పెళ్లిళ్లు, సినీ ప్రస్థానంలో ఎదుర్కొన్న సవాళ్లపై బాలయ్య ప్రశ్నలు అడగడంతో పవన్ కొంత ఇబ్బంది ఎదుర్కొన్నాడు. అయినా కూడా పవన్ తనదైన స్టైల్లో సమాధానం ఇచ్చాడు. ఈ మధ్యలో రామ్ చరణ్, సాయిధ...
Viral Video : జీవితంలో పెళ్లి ఒకసారే జరుగుతుంది. అందుకే చాలామంది తమ పెళ్లిని జీవితాంతం గుర్తుండేలా ప్లాన్ చేసుకుంటారు. పెళ్లి రోజు అందరికీ గుర్తుండేలా వెరైటీగా, వింతగా, ఏదో కొత్తగా చేస్తుంటారు. ఈ మధ్య పెళ్లిళ్లలో పెళ్లికొడుకు, పెళ్లికూతురు డ్యాన్స్ చాలా ఫేమస్ అయింది. ఇప్పుడు అదే ట్రెండ్ కొనసాగుతోంది. కానీ.. ఈ పెళ్లికూతురు మాత్రం పెళ్లికొడుకుకు షాక్ ఇద్దామనుకుందో ఏమో కానీ.. పెళ్లికూతురు జడ మొత్త...
నెలన్నర ముందు వివాహ మండపం బుక్ చేసుకుంటే తీరా పెళ్లి సమయం వచ్చేసరికి మండపం నిర్వాహకులు షాకిచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన ఉండడంతో తాము మండపం ఇవ్వలేమని తేల్చి చెప్పారు. దీంతో హడావుడిగా వెంటనే వేరే మండపం కోసం కాబోయే దంపతులు వెతుక్కోవాల్సిన పరిస్థితి ఎదురైంది. సీఎం జగన్ పర్యటన తమ చావుకొచ్చిందని ఆ కుటుంబసభ్యులు వాపోయారు. ఈ సంఘటన ఏపీలోని విశాఖపట్టణంలో జరిగింది. దీనికి సంబంధించిన ...
జబర్దస్త్ షో ద్వారా పరిచయమైన రాకింగ్ రాకేశ్, జోర్దార్ సుజాత త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్న వారిద్దరూ చాలా షోలలో కలిసి సందడి చేస్తున్నారు. తమ ప్రేమ బంధానికి వారి కుటుంబసభ్యులు అంగీకారం తెలపడంతో ఇక వారిద్దరూ ఒక్కటి కాబోతున్నారు. ఈ క్రమంలో శుక్రవారం రాకేశ్, సుజాతల నిశ్చితార్థం శుక్రవారం ఘనంగా జరిగింది. హైదరాబాద్ లో జరిగిన ఈ వేడుకకు ఆంధ్రప్రదేశ్ మంత్రి రోజా హాజరై...
విక్టరీ వెంకటేష్ హీరోగా 75వ చిత్రం తెరకెక్కనుంది. ఇటీవలె హిట్ 2 సినిమాతో విజయాన్ని అందుకున్న డైరెక్టర్ శైలేషన్ కొలను వెంకీ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. వెంకట్ బోయనపల్లి ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ‘సైంధవ్’ అనే టైటిల్ ను చిత్ర యూనిట్ ఇప్పటికే అనౌన్స్ చేసింది. ఈ సినిమాలో వెంకటేష్ పవర్ ఫుల్ లుక్ లో కనిపించనున్నారు. చేతిలో తుపాకీ పట్టుకుని టెర్రిఫిక్ ...
ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి వరుసగా అవార్డులు అందుకుంటూ చరిత్రను తిరగరాస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డును అందుకుని తెలుగు పాట ఖ్యాతిని పెంచారు. ఇప్పుడు ఆస్కార్ నామినేషన్ల లిస్టులో నాటు నాటు పాట చేరడంతో మరో ఘనత సాధించారు. తాజాగా నేడు ఆయన పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. Much honoured by the civilian award from the Govt of India 🙏 Respect for my...
ట్విట్టర్ యజమాని, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ తన పేరును మార్చుకుని వార్తల్లో నిలిచారు. ట్విట్టర్ లో తన ప్రొఫైల్ పేరును ఆయన ”మిస్టర్ ట్వీట్”గా మార్చుకున్నారు. ఇకపై ట్వీట్టర్ లో ఆయన్ని అందరూ మిస్టర్ ట్వీట్ అని పిలుస్తారు. సోషల్ మీడియాలో తన పేర్లు మార్చుకోవడం ఎలాన్ మస్క్ కు ఒక అలవాటు. ఇక నుంచి ఎలాన్ మస్క్ ట్విట్టర్ వేదికపై ఆ పేరుతోనే కొనసాగనున్నారు. తాను కొత్త పేరు మార్చుకునే అవకాశం ఉండద...
రిలయన్స్ సంస్థల అధినేత ముకేశ్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ నేడు శ్రీవారిని దర్శించుకున్నారు. గురువారం ఉదయం తనకు కాబోయే భార్య రాధికా మర్చంట్ తో కలిసి అనంత్ అంబానీ శ్రీవారిని దర్శించుకున్నారు. అర్చన సేవలో పాల్గొన్న వారికి టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ కు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. https://twitter.com/i/status/1618455125399588864 గురువారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శ...
ఆఫ్ఘనిస్తాన్ లో చలిగాలుల తీవ్రత ఎక్కువవుతోంది. దీంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. 15 రోజుల వ్యవధిలోనే దాదాపు 157 మంది చలిగాలులకు తట్టుకోలేక మరణించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోనే ఈ మరణాలు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ మరణాలపై ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల సమితి తీవ్ర విచారం వ్యక్తి చేసింది. ఆఫ్ఘన్ లో వాతావరణం మరీ చల్లబడిపోయిందని, మైనస్ 28 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతున్నట్లు వాతా...
ఈ మధ్యకాలంలో సాఫ్ట్ వేర్ కంపెనీల్లో ఉద్యోగాల కోత కొనసాగుతూ ఉంది. ఇప్పటికే ప్రముఖ మల్టీనేషనల్ టెక్ కంపెనీలు అయిన గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, మెటా సంస్థలు వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగించాయి. ఇంకొంత మందిని కూడా సాఫ్ట్ వేర్ కంపెనీలు తొలగించుకునేందుకు సిద్ధంగా ఉన్నాయి. తాజాగా ఈ కంపెనీల జాబితాలోకి ప్రముఖ మల్టీనేషనల్ టెక్నాలజీ సంస్థ, ఐటీ దిగ్గజం ఐబీఎం కూడా చేరింది. ఐబీఎం కంపెనీ తన సిబ్బందిలో 3900 మం...
సినీ ఇండస్ట్రీని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. ఈ మధ్యనే టాలీవుడ్ యువ నటుడు సుధీర్ వర్మ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ ఘటన మరువకముందే తాజాగా కోలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సీనియర్ దర్శకుడు ఈ.రామదాస్ కన్నుమూశారు. సినీ ఇండస్ట్రీలో ఈయన డైరెక్టర్ గానే కాకుండా పలు సినిమాల్లో ఆర్టిస్టుగా కూడా చేశాడు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. చూలైమేడుల...
తిరుమల శ్రీవారి దర్శనం కోసం ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు తరలి వస్తుంటారు. తాజాగా తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు రెండు కంపార్టుమెంట్లలో ఎదురుచూస్తున్నారు. టోకెన్లు లేని భక్తులకు మాత్రం దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక దర్శనం టికెట్లు గలవారికి 5 గంటల్లోనే దర్శనం పూర్తవుతోందని టీటీడీ అధికారులు తెలిపారు. నిన్న స్వామివారిని 69,221 మంది దర్శించుకున్నారు. అలాగే ...
హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎస్ శాంతి కుమారి హాజరయ్యారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ప్రజలకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యాంగ రచనలో అంబేద్కర్ ఎంతో అంకితభావం కనబరిచారని అన్నారు. ఆ రాజ్యాంగం ప్రకారంగానే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిందని తెలిపారు. శతాబ్దాల చరిత్ర ఉన్న హైద...
నేడు వసంత పంచమి సందర్భంగా బాసర సరస్వతీ అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. చదువుల తల్లి సరస్వతి దేవిని స్తుతించే పవిత్రదినం కావడంతో బాసరలో ఘనంగా వేడుకలు నిర్వహిస్తున్నారు. ఆలయ అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. వసంత పంచమి కావడంతో భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్దసంఖ్యలో వచ్చారు. తెల్లవారుజాము నుంచే పిల్లలకు అక్షరాభ్యాస కార్యక్రమాలను ప్రారంభించారు. భక్తులు అమ్మవారిక...