ట్విట్టర్ యజమాని, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ తన పేరును మార్చుకుని వార్తల్లో నిలిచారు. ట్విట్టర్ లో తన ప్రొఫైల్ పేరును ఆయన ”మిస్టర్ ట్వీట్”గా మార్చుకున్నారు. ఇకపై ట్వీట్టర్ లో ఆయన్ని అందరూ మిస్టర్ ట్వీట్ అని పిలుస్తారు. సోషల్ మీడియాలో తన పేర్లు మార్చుకోవడం ఎలాన్ మస్క్ కు ఒక అలవాటు. ఇక నుంచి ఎలాన్ మస్క్ ట్విట్టర్ వేదికపై ఆ పేరుతోనే కొనసాగనున్నారు. తాను కొత్త పేరు మార్చుకునే అవకాశం ఉండదు. తిరిగి పాత పేరుకు మారిపోవడానికి ట్విట్టర్ అనుమతించదని స్వయంగా మస్క్ వెల్లడించాడు.
ట్విట్టర్ ను కొనుగోలు చేయకముందు ఎలాన్ మస్క్ ఈ ప్లాట్ ఫామ్ పై ఎంతో చురుగ్గా ఉండేవారు. ఫాలోవర్లకు టచ్ లో ఉంటూ అనేక ప్రకటనలు చేసేవారు. అయితే ట్విట్టర్ కొనుగోలు తర్వాత కోర్టులో ఓ కేసు విషయమై హాజరయ్యారు. ఆ సమయంలో అటార్నీ అనుకోకుండా ఎలాన్ మస్క్ ను మిస్టర్ ట్వీట్ అని సంబోధించారు. ఆ పేరు మస్క్ కు తెగ నచ్చేసింది. దీంతో ఆ పేరునే తన ట్విట్టర్ అకౌంట్ కు పెట్టుకున్నారు.