జబర్దస్త్ షో ద్వారా పరిచయమైన రాకింగ్ రాకేశ్, జోర్దార్ సుజాత త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్న వారిద్దరూ చాలా షోలలో కలిసి సందడి చేస్తున్నారు. తమ ప్రేమ బంధానికి వారి కుటుంబసభ్యులు అంగీకారం తెలపడంతో ఇక వారిద్దరూ ఒక్కటి కాబోతున్నారు. ఈ క్రమంలో శుక్రవారం రాకేశ్, సుజాతల నిశ్చితార్థం శుక్రవారం ఘనంగా జరిగింది. హైదరాబాద్ లో జరిగిన ఈ వేడుకకు ఆంధ్రప్రదేశ్ మంత్రి రోజా హాజరై సందడి చేయగా.. బుల్లి తెర తారలు తరలివచ్చారు.
ఈ వేడుకలో ఏపీ మంత్రి రోజా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కొత్త జంటను రోజా ఆశీర్వదించారు. ఇక యాంకర్లు అనసూయ, రవి, బుల్లితెర నటీనటులు హారిక, గెటప్ శ్రీను సందడి చేశారు. తాము పెళ్లి చేసుకోబోతున్నామని ఇటీవల రాకేశ్, సుజాత యూట్యూబ్ చానల్ ద్వారా తెలిపారు. అన్నట్టుగానే కొద్దిరోజుల్లోనే నిశ్చితార్థం చేసుకున్నారు. త్వరలోనే వీరి వివాహం జరుగనుంది. సుజాత, రాకేశ్ కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఓ న్యూస్ చానల్ లో జోర్దార్ న్యూస్ షో ద్వారా సుజాత యాంకరింగ్ చేస్తోంది. దాని ద్వారా ఆమెకు జోర్దార్ సుజాతగా పేరొచ్చింది. తెలంగాణ యాసలో మాట్లాడుతూ వైరల్ గా మారడంతో బిగ్ బాస్ షోలో అవకాశం వచ్చింది. అనంతరం జబర్దస్త్ షోలోకి ప్రవేశించడంతో అక్కడ రాకేశ్ తో పరిచయమైంది. అతడి స్కిట్స్ లో నటిస్తుండడంతో వారిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. త్వరలోనే వీరి పెళ్లి తేదీ ప్రకటించనున్నారు.