రిలయన్స్ సంస్థల అధినేత ముకేశ్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ నేడు శ్రీవారిని దర్శించుకున్నారు. గురువారం ఉదయం తనకు కాబోయే భార్య రాధికా మర్చంట్ తో కలిసి అనంత్ అంబానీ శ్రీవారిని దర్శించుకున్నారు. అర్చన సేవలో పాల్గొన్న వారికి టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ కు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు.
https://twitter.com/i/status/1618455125399588864
గురువారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో తిరుమల శ్రీవారిని అనంత్ అంబానీ, రాధికలు దర్శించుకున్నారు. వీరికి టీటీడీ ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వాదం అందించారు. రాధిక మర్చంట్, అనంత్ అంబానీకి ఈమధ్యనే నిశ్చితార్థం అయ్యింది. ప్రస్తుతం వీరికి సంబంధించిన ఫోటోలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అనంత్ అంబానీ, రాధిక మర్చంట్లకు ఇటీవలే నిశ్చితార్థం అయ్యింది. ఈ తరుణంలో పెళ్లికి ముందు తీర్థయాత్రలు చేస్తున్నారు. ఇప్పటికే అసోంలోని కామాఖ్య ఆలయం, పూరీలోని జగన్నాథ్ ఆలయంలో పూజలు చేశారు.