ఆస్కార్ ప్రమోషన్స్ లో భాగంగా అమెరికాలో ఉన్న టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అక్కడి అభిమానులతో ఎమోషనల్ గా మాట్లాడారు. 'మీరు నా పైన ఎంత ప్రేమ చూపిస్తున్నారో... అంతకంటే ఎక్కువ ప్రేమ మీ పైన నాకు ఉన్నది.' అన్నారు.
కర్నాటకలోని ధార్వాడ్ జిల్లాలో ఓ కాంగ్రెస్ పార్టీ నాయకుడు స్టేజ్ పైన డ్యాన్స్ చేస్తున్న మహిళా డ్యాన్సర్ పైన డబ్బుల వర్షం కురిపించాడు. ఇది ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. సదరు కాంగ్రెస్ నాయకుడి పేరు శివశంకర్ హంపనవ. అతను తన స్నేహితుడి ఇంట్లో ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు. ఆ సమయంలో స్టేజ్ పైన డ్యాన్స్ చేస్తున్న మహిళ పైన నోట్లు వెదజల్లుతున్న వీడియో, ఫోటోలు బయటకు వచ్చాయి.
ఈ ఉత్సవం నిర్వహించరాదని న్యాయస్థానాల వరకు చేరింది. అయినా తమ గ్రామం క్షేమం కోరి తాము నిర్వహించుకుంటామని గ్రామస్తులు ముక్తకంఠంతో చెబుతుండడంతో ఇక ఉత్సవానికి అనుమతులు లభిస్తున్నాయి. మీ సంప్రదాయాన్ని గౌరవిస్తాం కానీ ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉత్సవం నిర్వహించుకోవాలనే పోలీసుల సూచనతో పిడిగుద్దులాట ప్రతియేటా జరుగుతోంది.
బీహార్ జిల్లా నలందలో 45 ఏళ్ల శివరతి దేవి అనే మహిళ తన నలుగురు కోడళ్లతో కలిసి పరీక్ష రాసింది. చదువుకు వయస్సుతో సంబంధం లేదని అమె మరోసారి నిరూపించారు. నాలుగు పదులు దాటినప్పటికీ, ఓ వైపు ఇంటి పనులు చూసుకుంటూ, మరోవైపు కోడళ్లతో కలిసి పరీక్ష రాయడం అందరినీ ఆకర్షించింది.
యువతలో గుండెపోటు(Heart Attack) ఘటనలు గుబులు పుట్టిస్తున్నాయి. వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు(Heart Attack)కు గురై మరణిస్తున్నవారి సంఖ్య ఎక్కువవుతోంది. తాజాగా ఓ యువకుడు గుండెపోటుతో ప్రాణాలు విడిచిన ఘటన ఏపీలో చోటుచేసుకుంది. అతి చిన్న వయసులో 19 ఏళ్లకే ఆ యువకుడికి గుండెపోటు(Heart Attack) వచ్చింది. స్నేహితులతో ఆడుతూ ఉండగానే ఆ యువకుడికి గుండెపోటు వచ్చింది.
ఫుడ్ డెలివరీ యాప్ (food delivery apps) స్విగ్గీ (swiggy) హోలీ పండుగ (holi festival) సందర్భంగా చేసిన బిల్ బోర్డు ప్రకటన వివాదానికి దారి తీసింది. స్విగ్గీ ఇతర మతాల పండుగల సమయంలో శుభాకాంక్షలు తెలుపుతూ, హిందూ పండుగ సమయంలో సూక్తులు వల్లిస్తోందని, వెంటనే స్విగ్గీ యాప్ ను అన్-ఇన్‌స్టాల్ చేయాలని పెద్ద ఎత్తున నెటిజన్లు మండిపడుతున్నారు.
కరోనా(Corona) తర్వాత గుండెపోటు(Heart Attack) ప్రమాదాలు ఎక్కువవుతున్నాయి. వయసుతో సంబంధం లేకుండా ఈ ప్రమాదం అందర్నీ భయపెడుతోంది. ముఖ్యంగా యువతలో ఈ ప్రమాదం ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తోంది. ఈ మధ్యనే ఓ వ్యక్తి వివాహం జరుగుతుండగా గుండెపోటు(Heart Attack) వచ్చి ప్రాణాలు విడిచిన ఘటన చోటుచేసుకుంది. ఆ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో చాలా మంది షాక్ అయ్యారు.
రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసు(money laundering case)లో ఆరోపణలు ఎదుర్కొంటున్న సుకేష్ చంద్రశేఖర్(sukesh chandrasekhar) హోలీ సందర్భంగా జాక్వెలిన్ ఫెర్నాండెజ్(Jacqueline FernandezJacqueline Fernandez )కు లేఖ రాశారు. ఆమె జీవితంలో 'రంగులు తిరిగి' ఇస్తానని హామీ ఇచ్చాడు. అంతేకాదు మీడియాతోపాటు తన మిత్రులు, శత్రులకు కూడా హోలీ(holi) పండుగ శుభాకాంక్షలు తెలిపాడు.
ఓ స్కూల్లో చిన్నారులు సామి.. సామి.. పాటకు డ్యాన్స్ చేసిన వీడియో ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. మూడు రోజుల క్రితం దీనిని ట్విట్టర్ లో పోస్ట్ చేయగా, 2వేలకు పైగా లైక్స్ వచ్చాయి. వేలాది మంది చూశారు.
Till now elections in AP:ఆంధ్రప్రదేశ్‌లో (andhra pradesh) ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీ అధికారంలోకి వస్తోంది. ఇదే అంశంపై తెలుగు360 (telugu360) ట్విట్టర్‌లో ఓ సర్వే రిపోర్ట్‌ను (survey report) షేర్ చేసింది. ఆ సర్వే ప్రకారం తెలుగుదేశం పార్టీ (tdp) 91 సీట్లు గెలుచుకుని అధికారం చేపడుతుందని పేర్కొంది.
Anand Mahindra : ప్రపంచ కుబేరుల్లో ఒకరైన బిల్ గేట్స్ ఆటో నడిపాడు. ఇండియాలో ఆయన ఎలక్ట్రిక్ ఆటోను నడిపించి వండర్ క్రియేట్ చేశారు.. మహేంద్ర కంపెనీకి చెందిన ట్రియో ఎలక్ట్రిక్ ఆటోలను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ కంపెనీ ఆటో ను ఇండియన్ రోడ్లపై నడుపుతూ బిల్ గేట్స్ హల్‌చల్ చేసి అందరిని ఆశ్చర్యానికి గురిచేశాడు.
ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) షేర్ చేసే వీడియోలు, ఫోటోలు అందరి మన్ననలు చూరగొంటాయి. అయితే తాజాగా చేసిన ఓ మోటివేషనల్ వీడియో పైన మాత్రం కొంతమంది నెటిజన్లు భిన్నంగా స్పందించారు.
ఈ వయసులో నేను నా కొడుకు, కోడలితో ఉండాల్సి ఉంది. కానీ వాళ్లు నన్ను చూసుకోవడం లేదు. ఇక వాళ్లకు ఆస్తి ఎలా ఇస్తాను. అందుకే నా యావదాస్తిని ప్రభుత్వానికి ఇవ్వాలని నిర్ణయించుకున్నా
నిజామాబాద్ జిల్లా మల్కాపూర్ గ్రామానికి చెందిన ఓ యువతి ఉన్నత చదువుల కోసం కెనడా వెళ్లి, కొద్ది రోజులకే గుండె పోటు కారణంగా కన్నుమూసింది. సోమవారం ఈమెను గ్రామానికి తీసుకు వచ్చారు. దీంతో ఆ గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.
మీరే మా రిపోర్టర్లు. మీ ఇలాకల మీ చుట్టు పక్కల జరిగే మంచి, చెడు, వింత.. ఏ ముచ్చట అయిన సరే మా మంది ముచ్చట్లకు పంపుర్రి. మీ పేరుతో ఆ ముచ్చట మన మంది ముచ్చట్ల చెప్తo. మరి దేనికి పంపాలి అనుకుంటుర్ర. ఈ నంబర్ కి Only Whatsapp ల పంపుర్రి. వార్త సూస్కోర్రి