»Anchor Shiva Jyothi Starts New Show Mandi Muchatlu News Programme In Youtube
Mandi Muchatlu కొత్త షో మొదలుపెట్టిన యాంకర్ శివజ్యోతి
మీరే మా రిపోర్టర్లు. మీ ఇలాకల మీ చుట్టు పక్కల జరిగే మంచి, చెడు, వింత.. ఏ ముచ్చట అయిన సరే మా మంది ముచ్చట్లకు పంపుర్రి. మీ పేరుతో ఆ ముచ్చట మన మంది ముచ్చట్ల చెప్తo. మరి దేనికి పంపాలి అనుకుంటుర్ర. ఈ నంబర్ కి Only Whatsapp ల పంపుర్రి. వార్త సూస్కోర్రి
తెలంగాణ యాసలో అద్భుతంగా వార్తలు చదివే యాంకర్ సావిత్రి అలియాస్ శివజ్యోతి (Shiva Jyothi). బిగ్ బాస్ (Bigg Boss) అనంతరం ఆమె కెరీర్ (Career) కొంత గందరగోళంలో పడింది. ప్రముఖ న్యూస్ చానల్ లో చేస్తున్నా అంతగా గుర్తింపు రాలేదు. గతంలో బిత్తిరి సత్తి (Bithiri Sathi)తో చేసిన షో మాదిరి కొనసాగలేదు. వారిద్దరితో కూడిన షో ట్రెండింగ్ (Trending)లో ఉండేది. ప్రస్తుతం సత్తి, సావిత్రి ఇద్దరు వేర్వేరు దారుల్లో వెళ్తున్నారు. కానీ వీరిద్దరూ యూట్యూబ్ చానల్స్ లో బిజీబిజీగా ఉన్నారు. ప్రస్తుతం శివజ్యోతి ప్రముఖ న్యూస్ చానల్ నుంచి వైదొలిగింది. కొత్తగా ఆమెనే గ్రామీణ నేపథ్యంలో షో మొదలుపెట్టింది. అది కూడా సామాన్యుల సహకారంతో నడిపించేందుకు సిద్ధమైంది. తొలి రోజు తన షోను ప్రారంభించింది. దీనికి అందరి దీవెనలు కావాలని శివజ్యోతి కోరుతున్నది.
నిజామాబాద్ జిల్లా (Nizamabad District) ముప్కాల్ మండలం నాగంపేట (Nagampet) గ్రామానికి చెందిన శివజ్యోతి ఓ చానల్ (Channel)లో తీన్మార్ వార్తలతో పాపులరైంది. అందులో సావిత్రక్క (Savithrakka) అనే పేరుతో తెలుగు రాష్ట్రాలతో పాటు తెలుగు ప్రజలు ఎక్కడుంటే అక్కడ వారికి సావిత్రక్క సుపరిచతం. బిత్తిరి సత్తితో కలిసి చేసిన షోలు వారిద్దరికీ మస్త్ పేర్లు తెచ్చాయి. ప్రస్తుతం ఆమె ఏ టీవీ షోలలో పని చేస్తలేదని కనిపిస్తోంది. ప్రస్తుతానికి యూట్యూబ్ పైనే ప్రధాన దృష్టి పెట్టింది. అయితే ఆమె నుంచి గతంలో చేసిన వార్తల మాదిరి ప్రేక్షకులు కోరుతుండడంతో శివజ్యోతి కొత్త షోను ప్రారంభించింది. ఆ వివరాలేంటో తెలుసుకోండి.
బిగ్ బాస్ షో అనంతరం ఓ టీవీ చానల్ లో పని చేసింది. అనంతరం ఆ షో నుంచి వైదొలిగినట్టు తెలుస్తున్నది. ప్రస్తుతం పూర్తి దృష్టంతా యూట్యూబ్ (Youtube)పైనే ఉంది. ఈ క్రమంలోనే తనకు పేరు తెచ్చిన తెలంగాణ (Telangana) యాసలో వార్తలు చెప్పడాన్ని తిరిగి కొనసాగించాలని శివజ్యోతి నిర్ణయించింది. సోమవారం నుండి ఆ షోను మొదలుపెట్టింది. ఇంతకీ ఆ షో పేరేమిటంటే ‘మందీ ముచ్చట్లు జోరుంటాయి (Mandi Muchatlu News Show)’ అనే షో ప్రారంభించింది. సమాజంలో జరుగుతున్న వార్తలను తెలంగాణ యాసలో తనదైన శైలిలో శివజ్యోతి వార్తలు చెప్పడం మొదలుపెట్టింది. జ్యోతక్క, జ్యోతక్క ముచ్చట్లు (Jyothakka Muchatlu) అనే రెండు యూబ్యూబ్ చానల్స్ నిర్వహిస్తోంది. దీనికి ఆమె భర్త గంగ్లూ చాలా సహకారం అందిస్తున్నాడు.
‘మీరే మా రిపోర్టర్లు. మీ ఇలాకల మీ చుట్టు పక్కల జరిగే మంచి, చెడు, వింత.. ఏ ముచ్చట అయిన సరే మా మంది ముచ్చట్లకు పంపుర్రి. మీ పేరుతో ఆ ముచ్చట మన మంది ముచ్చట్ల చెప్తo. మరి దేనికి పంపాలి అనుకుంటుర్ర. 9542633333 ఈ నంబర్ కి Only Whatsapp ల పంపుర్రి. వార్త సూస్కోర్రి.’ అంటూ మంది ముచ్చట్ల కార్యక్రమానికి ప్రేక్షకుల సహకారం కోరుతున్నది. దీనికి అనూహ్య స్పందన లభిస్తోంది. తమకు నచ్చిన వార్తలను సోషల్ మీడియాలో పంపుతూ ఆమెకు తోడుగా నిలుస్తున్నారు.