»Jr Ntr Making Fun With Fans In America Emotional Speech
JR NTR: ఫ్యాన్స్‌కు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా…
ఆస్కార్ ప్రమోషన్స్ లో భాగంగా అమెరికాలో ఉన్న టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అక్కడి అభిమానులతో ఎమోషనల్ గా మాట్లాడారు. 'మీరు నా పైన ఎంత ప్రేమ చూపిస్తున్నారో... అంతకంటే ఎక్కువ ప్రేమ మీ పైన నాకు ఉన్నది.' అన్నారు.
ఆస్కార్ ప్రమోషన్స్ లో భాగంగా అమెరికాలో ఉన్న టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అక్కడి అభిమానులతో ఎమోషనల్ గా మాట్లాడారు. ‘మీరు నా పైన ఎంత ప్రేమ చూపిస్తున్నారో… అంతకంటే ఎక్కువ ప్రేమ మీ పైన నాకు ఉన్నది. కానీ దానిని చూపించలేకపోవచ్చు. వాస్తవానికి మీ అభిమానులు అందరూ ఇక్కడ (స్టేజ్ పైన) ఉండాలి, నేను అక్కడ (ప్రేక్షకుల గ్యాలరీ) కూర్చోవాలి. మన మధ్య ఏ సంబంధం లేకపోయినప్పటికీ… ఏం చేసి మీకు అంతగా దగ్గరయ్యానో నాకైతే తెలియదు. మనది రక్త సంబంధం కంటే చాలా పెద్ద బంధం. మీరు నాకు సోదరులతో సమానం. మీ ప్రేమకు నేను ఒక్కటే చెప్పదలుచుకున్నాను. మీకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. మీ ప్రేమకు థ్యాంక్యూ… థ్యాంక్యూ. మరో జన్మ ఉంటే ఈ అభిమానం కోసమే పుట్టాలని నేను కోరుకుంటున్నాను.’ అని అభిమానులను ఉద్దేశించి జూనియర్ ఎమోషనల్ గా మాట్లాడారు. జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతున్న సమయంలో అభిమానులు అంతా జై ఎన్టీఆర్… ఐ లవ్ యూ అన్నయ్య… మీరు మా బ్రదర్ అన్నయ్యా.. అంటూ చెప్పుకొచ్చారు.
ఆ తర్వాత పలువురు అభిమానులతో కలిసి కాసేపు సరదాగా ముచ్చటించారు. అబ్బాయిలు ఎలా ఉన్నారు.. అంటూ వారిని పలకరించారు. ఎన్టీఆర్ వేసుకున్న బ్లాక్ టీ షర్ట్ పైన పులి బొమ్మ ఉండగా.. ఓ అభిమాని.. అన్నా పులి వెనుక పులి ఉంది అని సరదాగా అన్నారు.
అమెరికాలో జూనియర్ సందడి
అమెరికాలో జూనియర్ ఎన్టీఆర్ సందడి చేస్తున్నారు. ఆస్కార్ వేడుకలకు హాజరయ్యేందుకు ఇప్పటికే ఆర్ఆర్ఆర్ సినిమా దర్శకులు రాజమౌళి, నటుడు రామ్ చరణ్ ఇప్పటికే యూఎస్ఏలో ఉన్నారు. ఇప్పుడు వీరికి తారక్ తోడయ్యారు. అమెరికాలో ల్యాండ్ అయినప్పటి నుండి అభిమానులు పట్టరాని ఉత్సాహంతో కేరింతలు కొడుతున్నారు. ఎన్టీఆర్ కూడా తన ఫ్యాన్స్ తో ఫోటోలు దిగుతూ, వారిని సంతోష పెడుతున్నారు. ఓ అభిమాని కోరిక మేరకు అతని కుటుంబంతో కూడా ఫోన్లో మాట్లాడారు. కొంతమందికి ఆటోగ్రాఫ్ ఇచ్చారు.
గత ఏడాది విడుదలైన ఆర్ఆర్ఆర్ చిత్రం ఎన్నో అంతర్జాతీయ అవార్డులను వశం చేసుకున్నది. తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతిని మరోస్థాయికి తీసుకు వెళ్లింది. ఈ చిత్రం ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్, క్రిటిక్ ఛాయిస్ సహా పలు అంతర్జాతీయ అవార్డులు దక్కించుకున్నది. యావత్ ప్రపంచ సినిమా రంగం ప్రతిష్ఠాత్మకంగా భావించే ఆస్కార్ (Oscar) అవార్డు బరిలో కూడా నిలిచింది. ఈ చిత్రంలోని నాటు నాటు పాట ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఫైనల్ నామినేషన్స్‌లో ఉంది. ఈ నెల 13వ తేదీన అమెరికాలో 95వ అకాడమీ అవార్డుల వేడుక జరగనుంది. ఈ వేడుకల కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా తెలుగు సినీ అభిమానులు వేచి చూస్తున్నారు. ఈ ఈవెంట్ కోసం చెర్రీ (Ramcharan), రాజమౌళి (Rajamouli), కీరవాణి (Keeravani) తదితరులు ఇదివరకే అమెరికా చేరుకున్నారు. ఆ తర్వాత ఎన్టీఆర్ (Jr NTR) సోమవారం ఉదయం శంషాబాద్ విమానాశ్రయం నుండి అమెరికా చేరుకున్నారు. అతను హైదరాబాద్ బయలుదేరినప్పటి నుండి మొదలు… ఫోటోలు, అమెరికాలో అభిమానులతో వీడియోలు నెట్టింట సందడి చేస్తున్నాయి. ఇటీవల సోదరుడు తారకరత్న అకాల మరణం కారణంగా అమెరికాలో జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొనలేకపోయారు.