»Sukesh Chandrashekhar Letter To Jacqueline From Jail Will Bring The Lost Colors
Sukesh chandrashekhar: జైలు నుంచి జాక్వెలిన్ కి లేఖ..మాయమైన రంగులను తీసుకొస్తా
రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసు(money laundering case)లో ఆరోపణలు ఎదుర్కొంటున్న సుకేష్ చంద్రశేఖర్(sukesh chandrasekhar) హోలీ సందర్భంగా జాక్వెలిన్ ఫెర్నాండెజ్(Jacqueline FernandezJacqueline Fernandez
)కు లేఖ రాశారు. ఆమె జీవితంలో 'రంగులు తిరిగి' ఇస్తానని హామీ ఇచ్చాడు. అంతేకాదు మీడియాతోపాటు తన మిత్రులు, శత్రులకు కూడా హోలీ(holi) పండుగ శుభాకాంక్షలు తెలిపాడు.
200 కోట్ల రూపాయల మనీలాండరింగ్ (money laundering case) సహా పలు కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న సుకేష్ చంద్రశేఖర్(sukesh chandrasekhar) మరోసారి వార్తల్లో నిలిచారు. సుకేష్ ప్రస్తుతం ఢిల్లీలోని మండోలి జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. ఈ క్రమంలో హోలీ సందర్భంగా జైలు నుంచి లేఖ రాస్తూ బాలీవుడ్ నటి జాక్వెలిన్(Jacqueline Fernandez) ఫెర్నాండెజ్‌కి సుకేష్ తన ప్రేమను తెలియజేశాడు. దీంతోపాటు మీడియాకు, ఇతర వ్యక్తులకు కూడా హోలీ శుభాకాంక్షలు తెలిపాడు.
సుకేష్ లేఖలో మొదట మీడియా(media) వారికి హోలీ(holi) శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నాడు. దీంతోపాటు ఫ్రెండ్స్(friends) తన మద్దతు దారులు, తన ఎనిమీలకు, తన లీగల్(legal) బృందం సహా పలువురికి హోలీ శుభాకాంక్షలు తెలిపాడు. దీంతోపాటు అత్యంత అద్భుతమైన వ్యక్తి, నా అందమైన జాక్వెలిన్‌కు హోలీ శుభాకాంక్షలు అని రాసుకొచ్చారు. అంతేకాదు పండుగ రోజు, తాను వాగ్దానం చేస్తున్నానని వెల్లడించాడు. ప్రస్తుతం వెలిసిపోయిన లేదా మాయమైన రంగులను, తాను 100 సార్లు తిరిగి తీసుకువస్తానని పేర్కొన్నాడు. నేను దీన్ని నిర్ధారిస్తానని, ఇది తన బాధ్యత అని చెప్పుకొచ్చాడు.
అంతేకాదు సుకేష్ చంద్రశేఖర్ లేఖలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కి (Jacqueline)‘ఐ లవ్ యూ’ అని కూడా చెప్పాడు. ఆ లేఖలో ‘నా బేబీ, ఎప్పుడూ నవ్వుతూ ఉండు. నా కోసం, నువ్వు ఎంత ముఖ్యమో నీకు తెలుసు. లవ్ యూ మై ప్రిన్సెస్, మిస్ యూ, మై బీ, మై బొమ్మ, మై లవ్ అంటూ రాసుకొచ్చాడు. ఈ లెటర్ ప్రస్తుతం సోషల్ మీడియా(social media)లో తెగ చక్కర్లు కోడుతుంది.
రిలిగేర్ మాజీ ప్రమోటర్ మల్వీందర్ సింగ్ భార్య జప్నా సింగ్ దాఖలు చేసిన మనీలాండరింగ్ అభియోగంపై ఢిల్లీ కోర్టు(delhi court) కొన్ని రోజుల క్రితం సుఖేష్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) కస్టడీకి పంపింది. ఆ క్రమంలో డిల్లీలోని మండోలి జైలులో సుకేష్ ఉన్నారు.
రాన్ బాక్సీ మాజీ ప్రమోటర్లు మల్విందర్ సింగ్, శివిందర్ సింగ్ లకు బెయిల్(bail) ఇప్పిస్తామని నమ్మించి వారి భార్య దగ్గర నుంచి సుకేష్ చంద్ర శేఖర్(sukesh chandrasekhar) 200 కోట్ల రూపాయలు తీసుకున్నాడు. శివిందర్ సింగ్ భార్య అదితి సింగ్ కంప్లైంట్ మేరకు పోలీసులు(police) కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో సుకేష్ న్యాయశాఖలో ప్రముఖులను పరిచయం చేసుకుని ఈ దాందా చేసినట్లు తెలిసింది. ఇలా పలువురి నుంచి నగదు తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ కేసులో చంద్రశేఖర్ సన్నిహితుడు లీనా మారియా పాల్ సహా బాలీవుడ్ నటి జాక్వెలిన్(Jacqueline Fernandez)లకు సంబంధం ఉందన్న కారణంతో వీరిని అధికారులు ప్రశ్నించారు.