Road Accident : వామ్మో.. ఇలాంటి యాక్సిడెంట్ జీవితంలో చూసుండరు

హాలీవుడ్ సినిమాల్లో యాక్షన్ సీన్లు చూశారా.. వాటిల్లో కార్లు గాల్లోకి లేస్తుంటాయి. వాటిని తప్పించుకొని హీరోలు సేఫ్ ప్లేస్ కి వెళ్లిపోతాడు. ఇలాంటి సీన్లు జస్ట్ సినిమాల్లో మాత్రమే చూసి ఉంటారు.

  • Written By:
  • Publish Date - February 24, 2024 / 04:20 PM IST

Road Accident : హాలీవుడ్ సినిమాల్లో యాక్షన్ సీన్లు చూశారా.. వాటిల్లో కార్లు గాల్లోకి లేస్తుంటాయి. వాటిని తప్పించుకొని హీరోలు సేఫ్ ప్లేస్ కి వెళ్లిపోతాడు. ఇలాంటి సీన్లు జస్ట్ సినిమాల్లో మాత్రమే చూసి ఉంటారు. కానీ ఓ యాక్సిడెంట్ హాలీవుడ్ సినిమాను మించి పోయింది. దీనిని చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. మా జీవితంలో ఇలాంటి యాక్సిడెంట్ చూడలేదని అంటున్నారు. వందకు పైగా కార్లు ఒక్కసారిగా ఢీకొనడంతో పలు వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. పదుల సంఖ్యలో ప్రయాణికులు గాయపడ్డారు. సమాచారం అందుకున్న రెస్క్యూ టీం వెంటనే సహాయక చర్యలు చేపట్టింది. క్షతగాత్రులందరినీ సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

చదవండి:Central Govt : హోలీకి ముందే కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్

చైనాలోని సుజౌ సిటీ లో భారీ మంచు కురుస్తున్న కారణంగా హైవేపై ఈ దారుణం జరిగింది. మంచు కారణంగా వందకు పైగా వాహనాలు అదుపు తప్పి ఒకదానికొకటి ఢీకొన్నాయి. వరుసగా కార్లు ఢీకొనడంతో ఈ ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలన్నీ సమీపంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఉష్ణోగ్రతలు విపరీతంగా పడిపోవడంతో రోడ్డు ప్రయాణం కష్టంగా మారిందని మీడియా పేర్కొంది. తాజాగా జరిగిన ప్రమాదానికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని, అయితే ఆస్తినష్టం మాత్రం భారీగానే జరిగిందని పౌరులు చెబుతున్నారు.

చదవండి: Amabti Rambabu: పావలా వంతు కూడా పనికిరావని తేల్చేశారు.. అంబటి పోస్ట్ వైరల్

Related News

Vladimir Putin: చైనాకు రష్యా అధ్యక్షుడు పుతిన్‌.. రెండు రోజుల పర్యటన

రష్యా అధ్యక్షుడిగా వ్లాదిమిర్ పుతిన్ ఐదవసారి ఎన్నికైన విషయం తెలిసిందే. ఎన్నిక తరువాత తొలిసారిగా ఆయన చైనా దేశంలో పర్యటించనున్నారు. ఆ దేశ అధ్యక్షుడు ఆహ్వానం మేరకు పుతిన్ వెళ్తున్నారు.