ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల కంటే, రాజకియంగానే వార్తల్లో నిలుస్తున్నాడు. అయితే.. ఇప్పుడు ఎన్నికలు అయిపోయాయి, మరో 20 రోజుల్లో రిజల్ట్స్ రానున్నాయి. దీంతో.. ఓజి షూటింగ్‌కు ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
Pawan Kalyan: ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఈసారి పొలిటికల్‌గా విజయం సాధించడమే కాదు, సినిమాలతోను దుమ్ము దులిపేస్తాడనే గట్టి నమ్మకంతో ఉన్నారు. ప్రస్తుతం పవన్ కమిట్ అయిన సినిమాలు మూడు ఉన్నాయి. ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు, ఓజి చిత్రాలు సెట్స్ పై ఉన్నాయి. ఈ సినిమాల పై భారీ అంచనాలున్నాయి. ముఖ్యంగా పవన్ ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించనున్న ఓజి పై ఎక్స్పెక్టేషన్స్ పీక్స్‌లో ఉన్నాయి.
సుజీత్ ఈ సినిమాను హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన హంగ్రీ చీతా టీజర్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించింది. సెప్టెంబర్ 27న ఓజి రిలీజ్ చేస్తామని గతంలోనే అనౌన్స్ చేశారు మేకర్స్. అయితే.. పొలిటికల్ కారణంగా ఈ సినిమా అనుకున్న సమయానికి రిలీజ్ అవుతుందా? లేదా? అనే అనుమానాలున్నాయి. కానీ ఓజి కోసం పవన్ ఓ పదిహేను రోజులు డేట్స్ ఇస్తే, షూటింగ్ పూర్తవుతుందని అంటున్నారు. ఇక ఇప్పుడు ఏపీలో ఎన్నికలు ముగిశాయి. జూన్ 4న ఫలితాలు రానున్నాయి. దీంతో.. పవన్ తిరిగి సినిమా షూటింగ్స్‌లో పాల్గొనడానికి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది.
జూన్ చివరి వారంలో ఓజీ షూటింగ్లో పవన్ కళ్యాణ్ పాల్గొంటారని టాక్ నడుస్తోంది. ఇదే నిజమైతే.. అనుకున్న సమయానికి ఓజి రిలీజ్ అవడం పక్కా అని అంటున్నారు. ఇక ఈ చిత్రంలో ప్రియాంక మోహన్ హీరోయిన్గా నటిస్తుండగా, ఇమ్రాన్ హష్మీ, అర్జున్ దాస్, శ్రియా రెడ్డి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని డివివి ఎంటర్ టైన్మెంట్ పై డివివి దానయ్య గ్రాండ్‌గా నిర్మిస్తుండగా.. థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. మరి ఓజి ఎలా ఉంటుందో చూడాలి.