Mother Deer Fearlessly Fights Off Wild Coyote To Save Her Baby
Mother Deer: బిడ్డకు ప్రమాదం వాటిల్లే సమయంలో ఏ తల్లైనా సరే ధీటుగా స్పందిస్తోంది. అదీ మనుషులు అయినా.. జంతువులు అయినా సరే. అమెరికాలో ఓ కొయెట్ (కుక్కలో ఓ జాతి) జింక పిల్లపై దాడి చేయబోతుంది. దానిని జింక తల్లి (Mother Deer) ధీటుగా ఎదుర్కొంది. తల్లి జింక ఎదుర్కొన్న విధానం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది.
కొయెట్ తన బిడ్డను దాడి చేయకుండా తల్లి జింక (Mother Deer) అడ్డుకుంది. దాంతో పోరాటమే చేసింది. నిజానికి కొయెట్ ఆకారం పెద్దగా ఉంటుంది. కూృర జంతువు కూడా.. అయినప్పటికీ తనకు ఏం జరుగుతుందని అదీ ఆలోచించలేదు. తన బిడ్డను రక్షించుకుంది. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అవుతుంది.
తల్లి జింక (Mother Deer) పోరాటం చేయడంతో బిడ్డకు ఏమీ జరగలేదు. చిన్న గాయం కూడా కాలేదు. ఆ వీడియోను ట్విట్టర్లో మస్సిమో పేరుతో పోస్ట్ చేశారు. ఆ వీడియో తెగ చక్కర్లు కొడుతుంది. నెటిజన్లు తెగ కామెంట్స్ చేస్తున్నారు. వావ్.. డీర్ అంటూ దాని తెగువను పొగుడుతున్నారు. తల్లి జింక మిగతా జంతువులకు ఆదర్శంగా నిలుస్తోందని కామెంట్ చేస్తున్నారు. నిజమే.. ఆ తల్లి జింక తెగువ వీడియో చూసిన ప్రతీ ఒక్కరినీ కట్టిపడేసింది.