»Man Starts Dancing To Main Nikla During Gadar 2 Screening Viral Video
Gadar 2: థియేటర్లో ‘గదర్ 2’ చూస్తు ఆపుకోలేక ఆ పని చేసిన అభిమాని
ఒరిజినల్ చిత్రంలోని కొన్ని పాటలను ఇందులో అలాగే ఉంచారు. ఈ సినిమా ప్రదర్శనలో భాగంగా 'మైన్ నిక్లా గడ్డి లేకే' పాటకు ఓ వ్యక్తి డ్యాన్స్ చేసిన వీడియో వైరల్గా మారింది.
Gadar 2: బాలీవుడ్ లో 2001 నాటి సూపర్ హిట్ చిత్రం ‘గదర్: ఏక్ ప్రేమ్ కథ’కి సీక్వెల్ Gadar 2 ఆగస్ట్ 11, 2023న థియేటర్లలోకి వచ్చింది. దీంతో సినిమాకు సంబంధించిన పాత రోజులను నెమరువేసుకునేందుకు జనాలు థియేటర్లకు తరలివస్తున్నారు. మొదటి పార్టులో నటించిన సన్నీ డియోల్, అమీషా పటేల్, ఉత్కర్ష్ శర్మలు తమ పాత్రలను తిరిగి పోషించారు. ఈ చిత్రం కథ మొదటి చిత్రం నుండి 17 సంవత్సరాల తర్వాత సెట్ చేయబడింది.1971 ఇండో-పాకిస్తానీ యుద్ధంలో జైలులో ఉన్న తన కొడుకు కోసం వెతుకుతున్నప్పుడు సన్నీ డియోల్ పోషించిన తారా సింగ్ కథను అనుసరిస్తుంది. ఒరిజినల్ చిత్రంలోని కొన్ని పాటలను ఇందులో అలాగే ఉంచారు. ఈ సినిమా ప్రదర్శనలో భాగంగా ‘మైన్ నిక్లా గడ్డి లేకే’ పాటకు ఓ వ్యక్తి డ్యాన్స్ చేసిన వీడియో వైరల్గా మారింది.
డిజిటల్ కంటెంట్ సృష్టికర్త delhi_youtuber షేర్ చేసిన వీడియోలో ఒక వ్యక్తి థియేటర్లో ‘గదర్ 2’ చూస్తున్నట్లు కనిపించాడు. పాట తెరపై ప్లే అవుతున్నాపుడు. తాను లేచి డ్యాన్స్ చేయడం స్టార్ట్ చేశాడు. delhi_youtuber చేసిన వీడియో సినిమాలోని వివిధ సన్నివేశాలకు ప్రేక్షకుల స్పందనను చూపించే ఒక మాంటేజ్. ఈ సినిమాకు అనిల్ శర్మ దర్శకత్వం వహించారు. శక్తిమాన్ తల్వార్ రచించారు. ఈ చిత్రంలో సిమ్రత్ కౌర్, లవ్ సిన్హా, మనీష్ వాధ్వా కూడా కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి సంగీతం మిథున్ అందించగా, సాహిత్యం సయీద్ క్వాద్రీ రాశారు.