»Kangana Ranaut Defends Sunny Deols Viral Video Of Him Snapping At A Fan
Kangana Ranaut: అభిమానిపై అరిచిన సన్నీ పై కంగనా విమర్శలు
ఈ వీడియోలో సన్నీ సెల్ఫీ తీసుకుంటున్న అభిమాని పై ఆగ్రహించడం కనిపిస్తోంది. ఈ వీడియో అంతకంతకూ వైరల్ అవుతోంది. ఇప్పుడు బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ కూడా దీనిపై స్పందించింది. సన్నీ డియోల్‌కు మద్దతుగా నటి ట్వీట్ చేసింది.
Kangana Ranaut: బాక్సాఫీసు వద్ద సన్నీ డియోల్ సందడి చేస్తున్నారు. గదర్ 2 సినిమా ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు వచ్చి దాదాపు రూ.300కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ సినిమాపై అభిమానుల్లో విపరీతమైన క్రేజ్ నెలకొంది. ఇంతలో సన్నీ వీడియో ఒకటి వైరల్ అవుతోంది. దాని కారణంగా ఆయన ట్రోలిగ్ కు గురవుతున్నారు. ఈ వీడియోలో సన్నీ సెల్ఫీ తీసుకుంటున్న అభిమాని పై ఆగ్రహించడం కనిపిస్తోంది. ఈ వీడియో అంతకంతకూ వైరల్ అవుతోంది. ఇప్పుడు బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ కూడా దీనిపై స్పందించింది. సన్నీ డియోల్‌కు మద్దతుగా నటి ట్వీట్ చేసింది.
ట్విట్టర్ లేదా X ఖాతాలో పోస్ట్ చేసిన సన్నీ డియోల్ వీడియోపై కంగనా రనౌత్ వ్యాఖ్యానించింది. క్లిప్‌లో విమానాశ్రయంలో సన్నీడియోల్ తో ఫోటో దిగేందుకు ప్రయత్నించి అభిమానిని సన్నీ తిట్టడం కనిపించింది. దీనిపై కంగనా సన్నీకి మద్దతుగా నిలిచి ‘సెల్ఫీ కల్చర్’పై విమర్శలు గుప్పించింది. వీడియోపై కంగనా రనౌత్ మాట్లాడుతూ.. ‘ఇటువంటి సంఘటన ఎవరి ఉద్దేశాలను లేదా ప్రవర్తనను బయటపెడుతుంది. సెల్ఫీ సంస్కృతి భయంకరమైనది. ప్రజలు మనకు చాలా దగ్గరగా ఉంటారు. మనమందరం వైరస్ బారిన పడతాం. ప్రేమ భాషలు చాలా రకాలుగా ఉంటాయి. కేవలం సెల్ఫీలు, కౌగిలింతలు మాత్రమే ప్రేమ కాదు.
చాలా మంది కంగనాతో ఏకీభవించారు. ఒక ట్విట్టర్ వినియోగదారు ఇలా వ్రాశాడు, ‘మీరు చెప్పింది నిజమే. అన్ని వేళలా వందల మంది ప్రజల దృష్టిలో ఉండటం అంత సులభం కాదు. అన్ని వేళలా హ్యాపీ మూడ్‌లో ఉండటం కూడా సాధ్యం కాదు’ అని వ్యాఖ్యానించారు.