»Supriya Shrinate Congress Leader In Series Of Controversies
Supriya Shrinate: వరుస వివాదాల్లో కాంగ్రెస్ నేత
కాంగ్రెస్ నేత సుప్రియా శ్రీనేత్ మళ్లీ వివాదంలో చిక్కుకున్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో 29 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. అయితే ఈఘటనపై సుప్రియా మాట్లాడినట్లుగా ఉన్న వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
Supriya Shrinate: Congress leader in series of controversies
Supriya Shrinate: కాంగ్రెస్ నేత సుప్రియా శ్రీనేత్ మళ్లీ వివాదంలో చిక్కుకున్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో 29 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. అయితే ఈఘటనపై సుప్రియా మాట్లాడినట్లుగా ఉన్న వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. మృతిచెందిన మావోయిస్టులను అమరవీరులుగా తెలిపారు. ఈ ఘటనపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సుప్రియా వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ తీవ్ర విమర్శలు చేస్తోంది. ఛత్తీస్‌గఢ్ నేలను రక్తంతో తడిపిన నక్సలైట్లను అమరవీరులని పిలిచి ఈ రాష్ట్ర ప్రజలు, పోలీసులు, ప్రజాస్వామాన్ని సుప్రియా అపహాస్యం చేస్తున్నారని మండిపడింది.
శాంతి, అభివృద్ధి, ఉజ్వల భవిష్యత్‌కి నక్సలిజం అతిపెద్ద శత్రువు. దీన్ని నుంచి దేశానికి విముక్తి కల్పించాలని నిర్ణయించుకున్నమని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా కూడా స్పందించారు. కొన్ని రోజుల కిందట కంగన రౌనత్‌పై సుప్రియా విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయం తీవ్ర దుమారం రేపింది. దీంతో కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థులు జాబితాలో చోటు ఇవ్వలేదు. అలాగే కేంద్రం కూడా షోకాజ్ నోటీసులు ఇచ్చింది.