HNK: జిల్లాలోని నడికూడ మండలం వెంకటేశ్వర్లపల్లి పరిధిలో పంటచేనులో కనిపించిన అనుమానాస్పద పాదముద్రలను అటవీ శాఖ అధికారులు పరిశీలించి ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. ఇవి పులి పాదముద్రలు కాకపోవచ్చని ప్రాథమికంగా స్పష్టం చేస్తూ, పూర్తి నివేదిక వచ్చే వరకు రాత్రి వేళల్లో జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించారు.