ప్రకాశం: కనిగిరి నుంచి మార్కాపురం జిల్లా కేంద్రానికి ప్రయాణికుల సౌకర్యార్థం 13వ తేదీన నూతన బస్సు సర్వీసును ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి ప్రారంభించనున్నట్లు డిపో మేనేజర్ మహమ్మద్ సయనా బేగం తెలిపారు. ఈ నూతన సర్వీసుతో కనిగిరి ప్రాంత ప్రజలు, విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులకు మెరుగైన ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి రానుందని తెలిపారు.