»Man Fall Under The Truck But His Was Saved Video Goes Viral
Viral Video: భూమ్మీద నూకలుండడం అంటే ఇదేనేమో.. మీ కళ్లను కూడా నమ్మలేరు
దేవుడి అండ ఉన్న వాడికి ఎవరూ హాని చేయలేరు. టైం వస్తే తప్ప చావు దరిదాపుల కూడా రాదు ఇలాంటి కొన్ని సామెతలు వినే ఉంటారు. వాటికి చాలా ఉదాహరణలు కూడా చూసే ఉంటారు.
Viral Video: దేవుడి అండ ఉన్న వాడికి ఎవరూ హాని చేయలేరు. టైం వస్తే తప్ప చావు దరిదాపుల కూడా రాదు ఇలాంటి కొన్ని సామెతలు వినే ఉంటారు. వాటికి చాలా ఉదాహరణలు కూడా చూసే ఉంటారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఇది చూసిన తర్వాత మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ వీడియోలో ఓ వ్యక్తి దాదాపు చావు అంచుల దాకా వెళ్లాడు. కానీ దేవుడి దయతో ప్రాణాలను దక్కించుకున్నాడు.ఇది అతనికి రెండో జీవితంగా భావించవచ్చు. వీడియోను పరిశీలిస్తే.. ఓ వ్యక్తి బైక్పై వస్తున్నట్లు, ఎదురుగా ట్రక్కు వస్తున్నట్లు చూడవచ్చు. అతను తన బైక్ను కాపాడుకోవడానికి ఒక చిన్న సందులోకి ప్రవేశిస్తాడు. కానీ అకస్మాత్తుగా కారు డ్రైవర్ తన కారు డోర్ తెరుస్తాడు. దాని కారణంగా వ్యక్తి ఢీకొని కిందపడిపోయాడు. ట్రక్ అతని మీదుగా వెళుతుంది. అదృష్టవశాత్తూ ట్రక్కు టైరు అతనిపై నుంచి దూసుకెళ్లింది. అతను ట్రక్కు, నేల మధ్య ఇరుక్కుపోతాడు. ఇక్కడ డ్రైవర్ సడన్ గా వాహనాన్ని ఆపి వ్యక్తి బయటకు వస్తాడు.
ఈ వీడియో @NoContextHumans ట్విటర్ ఖాతాలో షేర్ చేయబడింది. ఈ వీడియోలో ఎంత నిజం ఉందో తెలియదు. ఎందుకంటే ఇలాంటి నకిలీ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇలాంటివి లైక్ లు, వ్యూస్ కోసం తయారు చేస్తున్నారు.