»Cobra Snake Sitting On Auto People Shocked To See The Viral Video
Viral Video: ఆటో ఎక్కి స్నేక్ రాజా డ్యాన్స్… భయంతో పరుగులు తీసిన జనం
ఆటో పైన ఒక పాము కూర్చున్నట్లు కనిపిస్తుంది. హెడ్లైట్గా మారినట్లు పడగ విప్పి ఆటో ముందు నిల్చుంది. దీంతో దాని దగ్గరికి వెళ్ళడానికి జనాలు భయపడుతున్నారు. పాము పడగతో ఆటో నంబర్ ప్లేట్‌కు ఎలా అతుక్కుని వీడియో తీస్తున్న వ్యక్తిని కాటు వేయడానికి ప్రయత్నించడం మీరు వీడియోలో చూడవచ్చు.
Viral Video: పాములను చూడటం పెద్ద విషయం కాదు. ఇవి ఎక్కడ చూసినా కనిపిస్తున్నాయి. కానీ నగరాల్లో పాములు చాలా అరుదుగా కనిపిస్తాయి. అవి గ్రామాల్లో చాలా ఎక్కువగా కనిపిస్తాయి. ఒక్కోసారి వీధుల్లో పరుగెత్తడం, ఒక్కోసారి ఇంట్లోకి వస్తుంటాయి. అటువంటి పరిస్థితిలో ప్రజల భయబ్రాంతులకు గురవుతుంటారు. పాములను తరిమికొట్టాలని ప్రయత్నించినా, ఇంట్లో నుంచి బయటకు రాకపోతే, వాటిని బలవంతంగా చంపేయడం లేదా అటవీ శాఖకు సమాచారం ఇవ్వడం చాలా సార్లు జరుగుతుంది. ప్రస్తుతం అలాంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ వీడియోలో ఆటో పైన ఒక పాము కూర్చున్నట్లు కనిపిస్తుంది. హెడ్లైట్గా మారినట్లు పడగ విప్పి ఆటో ముందు నిల్చుంది. దీంతో దాని దగ్గరికి వెళ్ళడానికి జనాలు భయపడుతున్నారు. పాము పడగతో ఆటో నంబర్ ప్లేట్‌కు ఎలా అతుక్కుని వీడియో తీస్తున్న వ్యక్తిని కాటు వేయడానికి ప్రయత్నించడం మీరు వీడియోలో చూడవచ్చు. అయితే, పాము వీడియో తీస్తున్న వ్యక్తిపై దాడికి ప్రయత్నించి వెంటనే వెనక్కి తగ్గుతుంది. ఒకవేళ అతడిని కాటేసి ఉన్నట్లైతే తప్పకుండా అతడికి ప్రాణాపాయం కలిగి ఉండేది. నాగుపాము ప్రపంచంలోని అత్యంత విషపూరిత పాములలో ఒకటిగా పరిగణించబడుతుంది. పామును చూసేందుకు స్కూలు పిల్లలు ఎలా గుమిగూడారో మీరు చూడవచ్చు.
ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో d_shrestha10 అనే ఐడితో షేర్ చేయబడింది. ఇది ఇప్పటివరకు 25 వేలకు పైగా వీక్షించబడింది. అయితే వందలాది మంది వీడియోను లైక్ చేశారు. వివిధ కామెంట్లను పోస్ట్ చేశారు.