»Social Media Influencer A Father Who Lost His Toddler After Experimenting On His Own Son
Social Media Influencer: సొంత కొడుకుపైన ప్రయోగాలు చేసి.. చేతులారా పసిబిడ్డను పొగొట్టుకున్న తండ్రి
రష్యాకు చెందిన ఓ ఇన్ఫ్లుయెన్సర్ తన సొంత కొడుకుపై ప్రయోగాలు చేసి చేతులారా పసిబిడ్డను చంపుకున్నాడు. అయితే ఈ ఘటన ఏడాది క్రితం జరగ్గా.. తాజాగా అతనిపై నేరం రుజువైంది.
Social Media Influencer: A father who lost his toddler after experimenting on his own son
Social Media Influencer: సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్గా మారాలని, వీడియోస్ బాగా వ్యూస్ రావాలని ఉద్దేశంతో కొందరు ప్రయోగాలు చేస్తుంటారు. అవగాహన లేన విషయాలపై మాట్లాడుతూ ఫాలోవర్లను తప్పుదోవ పట్టిస్తూ.. ఫాలోవర్లను పెంచుకుంటారు. ఇలాగే రష్యాకు చెందిన ఓ ఇన్ఫ్లుయెన్సర్ తన సొంత కొడుకుపై ప్రయోగాలు చేసి చేతులారా పసిబిడ్డను చంపుకున్నాడు. అయితే ఈ ఘటన ఏడాది క్రితం జరగ్గా.. తాజాగా నేరం రుజువైంది. దీంతో అతనికి ఎనిమిదేళ్ల కఠిన కారాగార శిక్ష పడింది. రష్యాకు చెందిన మాక్సిమ్ లైయుటీ వీడియోలు చేస్తుంటాడు. పచ్చి కూరగాయలతో ప్రత్యేక డైట్ చెబుతుంటాడు.
ఈక్రమంలో తాను ఆహారం, ఆరోగ్యం ఎంతో బలమైనవో ఈ సమాజానికి నిరూపించుకోవాలనుకున్నాడు. మనిషి బతకడానికి అసలు ఆహారం అవసరం లేదని, కేవలం సూర్యరశ్మితోనే ఎంతకాలమైన జీవించవచ్చు అనుకునేవాడు. దానిని నిరూపించడానికి నెలలు నిండని తన సొంత కొడుకుపై ప్రయోగాలు చేశాడు. ఆ శిశువుకు పాలు పెట్టనివ్వలేదు. శిశువును ఎండలో ఉంచేవాడు. అప్పుడప్పుడు చల్లని నీటిలో ముంచేవాడు. భార్య ఎంత వాదించిన మాక్సిమ్ మాట వినలేదు. అలా చేయడం వల్ల అతని శరీరం దృఢంగా తయారవుతుందని తండ్రి అనుకున్నాడు.
చివరికి పసికందు ఆరోగ్యం క్షీణించింది. దీంతో ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. వైద్యపరీక్షల్లో నిమోనియా, పలు సమస్యల వల్ల చనిపోయినట్లు తేలింది. దీంతో పోలీసులు మాక్సిమ్పై కేసు నమోదు చేశారు. గర్భవతిగా ఉన్నప్పుడు తన భార్య పౌష్టికాహారం తినకపోవడం వల్లే బిడ్డ అనారోగ్య సమస్యలతో మరణించాడని విచారణలో మాక్సిమ్ తెలిపాడు. తల్లి నిజం చెప్పింది. కోర్టు అతనిని దోషిగా తేల్చింది. ఆ తల్లికి రెండేళ్లు జైలు శిక్ష విధించగా.. అతనికి ఎనిమిదేళ్లు జైలు శిక్ష విధించారు.