BDK: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో శనివారం నుంచి వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో ఉత్సవాల ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. కళ్యాణ మండప ప్రాంగణంలో చలవ పందిళ్లు, చాందిని వస్త్రాలతో శోభాయానంగా వేదికను సిద్దం చేస్తున్నారు. రామాలయ ప్రాంగణాన్ని రంగవల్లులతో అలంకరించగా, దీపాలంకరణతో ఆలయం దేదీప్యమానంగా మారింది.