»Las Vegas An Employee Who Hadnt Taken Leave In 27 Years Was Gifted Two Chocolates By The Company
Viral News: 27 ఏళ్లుగా ఒక్క సెలవు పెట్టని ఉద్యోగి..కంపెనీ ఘోరమైన గిఫ్ట్
దాదాపు 27 ఏళ్లు ఒక్క రోజు కూడా సెలవు పెట్టకుండా పనిచేసిన ఒక ఉద్యోగికి ఆ కంపెనీ ఏం గిఫ్ట్ ఇచ్చిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఏ కారో బంగ్లానో ఇచ్చింది అనుకుంటున్నారా, అయితే మీరు పప్పులో కాలేసినట్లే. ఈ సిన్సియర్ ఉద్యోగికి రెండు చాక్లెట్లు బహుమతిగా ఇచ్చింది. ఏంటి నమ్మట్లేదా.. అయితే ఈ కథనం పూర్తిగా చదవండి.
Las Vegas, an employee who hadn't taken leave in 27 years was gifted two chocolates by the company.
Viral News: ఏ కంపెనీలో ఉద్యోగి అయినా సెలవులు పెట్టడం సాధారణమైన విషయం. వ్యక్తిగత విషయాలు కావచ్చు లేదా కుటుంబానికి సంబంధించిన వ్యవహారాలు కావచ్చు. మనిషి అన్నాక ఏదో ఒక అవసరం ఉంటూనే ఉంటుంది. కానీ ఓ వ్యక్తికి ఎలాంటి సమస్య వచ్చినా, ఎంతటి అవసరం ఏర్పడినా తన 27 సంవత్సరాల ఉద్యోగ జీవితంలో ఒక్కరోజు కూడా సెలవుపెట్టలేదంటా. ఇది నిజంగా అద్భమైన విషయమే. ఈ విషయాన్ని గుర్తించిన కంపెనీ యాజమాన్యం అతనికి బహుమతిగా రెండు చాక్లెట్లు చేతిలో పెట్టి ఇంటికి పంపించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వ్యక్తి పట్ల చాలా మంది సానుభూతిని ప్రదర్శించారు. తన కష్టాన్ని కళ్లారా చూసిన తన కుతూరు తండ్రికి అది తగిన గౌరవంలా అనిపించలేదని పేర్కొంది. ఇదే విషయాన్ని ప్రజల ముందుంచింది. ఫలితంగా ఆయన 3.5 కోట్ల రూపాయల ఆదాయానికి ఆస్తిపరుడయ్యాడు.
అతని పేరు కెవిన్ ఫోర్డ్. గత 27 ఏళ్లుగా లాస్ వేగాస్లోని మెక్‌కేరెన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో క్యాషియర్‌గా పనిచేస్తున్నారు. గత ఏడాది ఆయన ఈమైలురాయిని చేరుకున్నారు. ఈ సందర్భంగా కెవిన్‌కు ఉద్యోగులు కేవలం రెండు చాక్లెట్లు, ఓ కాఫీ కప్పు బహుమతిగా ఇచ్చారు. ఈ వీడియో వైరల్‌గా మారడంతో నెటిజన్లతో పాటూ కెవిన్ కూతురిని కూడా బాధపడింది. కెవిన్ కష్టానికి తగిన గుర్తింపు దక్కలేదని అందరు భావించారు. తమ కోసం ఇంతగా కష్టపడ్డ తండ్రికి తగిన గుర్తింపు దక్కేలేదని ఆయన పేరిట విరాళాల సేకరణకు గోఫండ్‌మీ పేజ్‌ను ప్రారంభించింది తన కూతురు. అందులో ఇలా రాసుకొచ్చింది. ‘‘అమ్మ నుంచి విడిపోయాక అక్కా, నేను నాన్న దగ్గరే పెరిగాము. చిన్నప్పటి నుంచీ మమ్మల్ని ఏ కష్టం రాకుండా పెంచేందుకు ఆయన ఉద్యోగం చేయడం ప్రారంభించారు. ఆ తరువాత ఆయన మళ్లీ పెళ్లి కూడా చేసుకోలేదు.
బర్గర్ కింగ్ ఉద్యోగులకు, వారి కుటుంబాలకు మెరుగైన హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నందున ఆయన అక్కడే కొనసాగారు. మా నాన్న ఇప్పటికీ అక్కడే పనిచేస్తున్నారు. త్వరలో ఆయన రిటైర్ కానున్నారు. జీవితంలో ఇంత కష్టపడినా ఆయన కష్టానికి గుర్తింపు దక్కలేదు. అని ఆమె రాసుకొచ్చింది. ఈ పోస్టుకు నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందించారు. భవిష్యత్తులో పెద్దాయనకు డబ్బు అవసరాల గురించి బెంగలేకుండా పెద్ద ఎత్తున విరాళాలు ఇచ్చారు. ఈ క్రమంలో మొత్తం రూ.3.5 కోట్లు ఆయనకు దక్కాయి. దీంతో కెవిన్ ఆనందానికి అంతేలేకుండా పోయింది.