ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి అధికారంలో ఉన్న పార్టీ నేతను ఓ సాధారణ కూలీ ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించారు. అంతేకాదు ప్రజలు కూడా అతనికే పట్టం కట్టారు. అయితే అతను ఎవరు? ఆ వివరాలేంటనేది ఇప్పుడు చుద్దాం.
labour Eshwar Sahu defeated the 7 times congress MLA in chhattisgarh
ఛత్తీస్‌గఢ్(chhattisgarh)లో ఐదేళ్ల కాంగ్రెస్ పాలన తర్వాత భూపేష్ బఘెల్ ప్రభుత్వ కలలు గల్లంతైన తర్వాత బీజేపీ మళ్లీ అధికారంలోకి వచ్చింది. బీజేపీ 54 స్థానాల్లో గెలుపొందగా, కాంగ్రెస్ 35 స్థానాల్లో విజయం సాధించింది. రాష్ట్రంలో అనేక స్థానాల్లో గట్టి పోటీలు జరిగాయి. అలాగే మాజీ డిప్యూటీ సిఎం టిఎస్ సింగ్ డియో కేవలం 94 ఓట్ల తేడాతో బీజేపీకి చెందిన రాజేష్ అగర్వాల్ చేతిలో ఓడిపోయారు. అయితే ఛత్తీస్‌గఢ్‌లోని బెమెతారా జిల్లాలో మరో ఘోరం జరిగింది. బెమెతర జిల్లాలోని సజా శాసనసభ స్థానంలో కీలకమైన ట్వీస్ట్ చోటుచేసుకుంది. పోటీ చేసిన స్థానానికి బీజేపీ నుంచి సాధారణ కూలి అయిన ఈశ్వర్ సాహు(Ishwar Sahu), కాంగ్రెస్ నుంచి రవీంద్ర చౌబే(Ravindra Chaube) బరిలో నిలిచారు. ఏడుసార్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన రవీంద్ర చౌబేపై ఈశ్వర్ సాహు 5196 ఓట్ల తేడాతో విజయం సాధించడం విశేషం.
He is Eshwar Sahu, a labour, now a BJP MLA in Chattisgarh. We fielded him, after his son was killed by a Muslim mob, and the Congress chose to side with the murderers. Today, he defeated Ravindra Choubey, a 7 time Congress MLA!
He won’t get his son back but some closure perhaps… pic.twitter.com/NqpENwRBED
ఈశ్వర్ సాహు తన కుమారుడు మూకుమ్మడి దాడిలో మృతి చెందడంతో ఆయనకు బీజేపీ టికెట్ ఇచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం దోషులకు అండగా నిలుస్తోందని బీజేపీ(BJP) ఆరోపించింది. అతను ఈశ్వర్ సాహు, కార్మికుడు కాగా..ఇప్పుడు ఛత్తీస్‌గఢ్‌లో బిజెపి ఎమ్మెల్యేగా మారిపోయాడు. అతని కొడుకును ముస్లిం గుంపు చంపిన తరువాత తాము అతనిని అండగా ఉన్నట్లు బీజేపీ నేతలు తెలిపారు. అతను తన కుమారుడిని తిరిగి పొందలేడు. కానీ బహుశా కొంత ఉపశమనం పొందాడని చెప్పవచ్చని సాహు ఫోటోను షేర్ చేస్తూ బిజెపి నాయకుడు అమిత్ మాల్వియా అన్నారు.
బీజేపీ ఈశ్వర్ సాహుకు టిక్కెట్ ఇచ్చి ఎన్నికల బరిలోకి దింపింది. కాంగ్రెస్(congress) దిగ్గజ ఎమ్మెల్యే రవీంద్ర చౌబేపై ఈశ్వర్ సాహు విజయం సాధించారు. సాహుకు 101789 ఓట్లు రాగా, చౌబేకి 96593 ఓట్లు వచ్చాయి. సజా శాసనసభ స్థానంలో 83.19% ఓటింగ్ నమోదైంది. గతంలో 2018లో ఈ సీటులో 79.8% ఓటింగ్ నమోదైంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి రవీంద్ర చౌబే 17.6% ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి లభ్చంద్ బఫ్నాపై విజయం సాధించారు.