Instagram Influencer : ఇది సోషల్ మీడియా యుగం. నేటి యూత్ మొత్తం ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ అంటూ వాటితోనే ఎక్కువ సేపు గడుపుతున్నారు. ఎప్పుడూ ఫోటోలు, రీల్స్ షేర్ చేస్తూ లైక్స్, కామెంట్ల కోసం వెంపర్లాడుతున్నారు. తాజాగా ఓ యువతి ఇన్ స్టా రీల్ చేయడం కోసం ఏకంగా హైవే మధ్యలో కారు ఆపింది. రోడ్డు మధ్యలో అది కూడా హైవే మీద కారు ఆపకూడదని తెలిసి కూడా ఇన్ స్టా రీల్ చేయడం కోసం కారు ఆపేసింది. రీల్ చేసింది.. దాన్ని తన ఇన్ స్టాలో అప్ లోడ్ చేసింది.
ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో అది కాస్త ఘజియాబాద్ ట్రాఫిక్ పోలీసుల కంట పడింది. ట్రాఫిక్ రూల్స్ ను ఆ యువతి బ్రేక్ చేసినందుకు.. ఆ కారు ఓనర్ కు ట్రాఫిక్ పోలీసులు రూ.17 వేల ఫైన్ వేశారు. ఆ యువతి పేరు వైశాలి చౌదరి కుటైల్. తను సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్. యూపీకి చెందిన ఈ యువతికి సోషల్ మీడియాలో బీభత్సంగా ఫ్యాన్స్ ఉన్నారు.
Instagram Influencer : ఫైన్ తో పాటు యువతి మీద కేసు
కారును హైవే మధ్యలో ఆపినందుకు ఫైన్ వేసి ఆ యువతిపై కేసు కూడా నమోదు చేశారు పోలీసులు. దీనికి సంబంధించి సహిదాబాద్ ఏసీపీ ట్విట్టర్ లో స్టేట్ మెంట్ కూడా ఇచ్చారు. దీనిపై వైశాలి ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు. ఆమెపై ఎలా కేసు పెడతారు.. ఏం తప్పు చేసిందంటూ సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్నారు. మొత్తానికి ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. కేవలం ఒక్క వీడియో ఓ ఇన్ ఫ్లూయెన్సర్ జీవితాన్నే మార్చేసింది. ఆ వీడియోను మీరు కూడా చూసేయండి.
थाना साहिबाबाद क्षेत्रान्तर्गत एलिवेटिड रोड पर युवती द्वारा रील बनाते हुये सोशल मीडिया पर वायरल वीडियो के सम्बन्ध मे थाना साहिबाबाद पर अभियोग पंजीकृत किया गया है। अग्रिम विधिक कार्यवाही की जा रही है। ट्रैफिक पुलिस द्वारा उक्त कार का 17000 रु0 का चालान किया गया है-एसीपी साहिबाबाद pic.twitter.com/z0byqdvAt7
— POLICE COMMISSIONERATE GHAZIABAD (@ghaziabadpolice) January 22, 2023