»Heartbreaking Video Of Soldiers Wife Lying On His Funeral In Chhattisgarh
Dantewadaలో గుండెల్ని పిండేసే ఘటన.. భర్త చితిపై పడుకుని భార్య రోదన
భర్త మరణించిన రోజు నుంచి మధామి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. భర్త అంత్యక్రియల సమయంలో అతడిని విడిచి ఉండలేక చితిపై పడుకుంది. అయితే కుటుంబసభ్యులు, బంధువులు ఆమెను ఓదార్చారు. పిల్లలు ఉన్నారు.. వారి గురించి ఆలోచించు అని కుటుంబసభ్యులు బుజ్జగించడంతో ఆమె చితిపై నుంచి కిందకు దిగింది.
మందుపాతరతో మావోయిస్టులు (Naxals) జవాన్ల వాహనాన్ని పేల్చిన ఘటన అందరినీ కన్నీటిపర్యంతం చేస్తోంది. ఆ ప్రమాదంలో మరణించిన మృతుల కుటుంబాలు కోలుకోలేకపోతున్నాయి. చేదోడుగా ఉన్న తమ పిల్లలు మృతి చెందడంతో వారి తల్లిదండ్రులు కన్నీటి సుడిలో మునిగిపోయారు. కాగా మృతుల భార్యలైతే తట్టుకోలేకపోతున్నారు. ఈ క్రమంలోనే తన భర్త అంత్యక్రియలు (Final Rituals) జరుపుతుంటే అతడి భార్య అతడిని విడిచి ఉండలేనంటూ ఏకంగా చితిపైకి ఎక్కింది. భర్తతో పాటు తనను దహనం చేయాలని రోదించడం అక్కడి వారిని కంటతడి పెట్టించింది. చివరకు ఆమెను శాంతిపజేయడంతో చితి నుంచి దిగింది. ఈ సంఘటన చత్తీస్ గడ్ (Chhattisgarh)లో చోటుచేసుకుంది.
దంతెవాడ జిల్లాలో (Dantewada District) ఏప్రిల్ 26న మావోయిస్టులు మందుపాతర ప్రయోగించారు. ఈ దాడిలో 10 మంది జవాన్లు, ఓ డ్రైవర్ మృతి చెందిన విషయం తెలిసిందే. మృతి చెందిన జవాన్లలో బీజాపూర్ జిల్లా (Bijapur District) నీరమ్ గ్రామానికి చెందిన లఖ్ము (Lakhmu) ఉన్నారు. మృతదేహం స్వగ్రామం రావడంతో అతడి అంత్యక్రియలు శుక్రవారం జరిపేందుకు ఏర్పాట్లు చేశారు. అంతిమయాత్ర అనంతరం చితి పేర్చి లుఖ్ము మృతదేహాన్ని దహనం చేసేందుకు సిద్ధమయ్యారు.
ఈ సమయంలో లుఖ్ము భార్య తులె మధామి తట్టుకోలేక భర్త చితిపై పడుకుంది. నా భర్తను విడిచి నేను ఉండలేనంటూ చితిపై బోర్లా పడుకుంది. ఈ సంఘటనతో అక్కడి వారు షాకయ్యారు. భర్తతో పాటు తనను దహనం చేయాలని తులె మధామి (Tule Madhami) కోరడం అక్కడి వారిని కన్నీటిపర్యంతం పెట్టించింది. లుఖ్ము, మధామి అన్యోన్యంగా ఉండేవారు. భర్త మరణించిన రోజు నుంచి మధామి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. భర్త అంత్యక్రియల సమయంలో అతడిని విడిచి ఉండలేక చితిపై పడుకుంది. అయితే కుటుంబసభ్యులు, బంధువులు ఆమెను ఓదార్చారు. పిల్లలు ఉన్నారు.. వారి గురించి ఆలోచించు అని కుటుంబసభ్యులు బుజ్జగించడంతో ఆమె చితిపై నుంచి కిందకు దిగింది. అనంతరం యథావిధిగా జవాన్ లుఖ్ము అంత్యక్రియలు అధికారికంగా నిర్వహించారు. దీనికి సంబంధించి వీడియో వైరల్ గా మారింది.
दंतेवाड़ा में हुए नक्सली हमले में शहीद हुए जवान के पार्थिव शरीर को जब अंतिम संस्कार के लिए चिता तक ले जाया गया तो जवान की विधवा पत्नी रोते हुए उसकी चिता पर लेट गई और कहने लगी मुझे भी साथ जाना है। तस्वीर विचलित कर देगी :@ranutiwari_17pic.twitter.com/PltQrCbr8i