సింహాన్నిమృగరాజు (Mrigaraju) అని ఊరికే అనలేదు. అడవిలో దాదాపుగా సింహాలదే ఆధిపత్యం ఉంటుంది. భారీ శరీరంతో, తీక్షణమైన చూపులతో సింహాలు(Lions) వణుకు పుట్టిస్తాయి. ఇక, అసలు విషయానికొస్తే… బలం విషయంలో ఆడ సింహాలు మగ సింహాలకు ఏమాత్రం తీసిపోవు. ఆడ సింహాలు దాదాపు 250 కిలోల బరువు ఉంటాయి.సింహాలు వివిధ రకాల అడవి జంతువులను వేటాడుతూ కనిపించే అనేక వీడియోలను మీరు సోషల్ మీడియా(Social media)లో చాలానే చూసి ఉంటారు. కొన్నిసార్లు చిన్న జంతువులను వేటాడితో.. మరొకొన్ని సార్లు పెద్ద ఏనుగుతో యుద్ధం చేస్తాయి. ప్రస్తుతం ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇందులో బోనులో ఉన్న సింహం ముగ్గురు ముగ్గురు బాడీబిల్డర్లతో ఒక గేమ్ ను ఆడుతుంది.మీరు తాడు లాగడం గేమ్ (Game) ను చూసే ఉంటారు. ఈ గేమ్ లో రెండు సమూహాలు ఏర్పడి వ్యక్తులు రెండు వైపుల నుండి తాడును లాగడానికి ప్రయత్నిస్తారు. ఇందులో పటిష్టంగా బలంగా ఉన్న గ్రూపు మాత్రమే విజయం సాధిస్తుంది. నెట్టింట్లో వైరల్(Viral) అవుతున్న వీడియోలో కూడా అలాంటి దృశ్యమే కనిపిస్తుంది. ఈ రోప్ పుల్లింగ్ గేమ్‌లో రెండు గ్రూపులు ఉన్నాయి. ఇందులో ఒకవైపు ముగ్గురు బాడీబిల్డర్ (Bodybuilder) తరహా వ్యక్తులు ఉండగా.. మరోవైపు ఒకే సింహం నిలబడి ఉంది. ఇరు వర్గాల మధ్య గట్టి పోటీ కనిపిస్తోంది. బాడీబిల్డర్లు తాడును బలవంతంగా లాగడానికి ప్రయత్నిస్తున్నారు. వారి బలం అంతా సింహం ముందు విఫలమయింది. చివరికి, ఆ ముగ్గురు బాడీబిల్డర్లు మృగరాజు బలం ముందు మోకరిల్లారు.