Health Tips: షుగర్ పేషెంట్స్‌కు అలర్ట్..అరటి పండుతో కలిగే నష్టాలివే
ఈరోజుల్లో చాలా మంది తమ ఆరోగ్యాన్ని(Health) ఎక్కువగా పట్టించుకోవడం లేదు. సరైన ఆహార నియమాలు(Food Habits) పాటించకపోవడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు(Health Problems) తలెత్తుతున్నాయి. సరైన పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు తీసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు మీ దరి చేరవు. పండ్లలో ముఖ్యంగా అరటి పండు(Banana Fruit) తినేందుకు చాలా మంది ఇష్టపడతారు. చాలా మందికి ఉదయం పరగడుపున అరటి పండు(Banana Fruit) తినే అలవాటు ఉంటుంది.

వ్యాయామం చేసిన వెంటనే మరికొందరు అరటి పండు(Banana Fruit)ను తింటుంటారు. ఇంకొందరైతే బ్రేక్ ఫాస్ట్(BreakFast) అసలే తినకుండా ఈ అరటి పండ్లను లాగించేస్తుంటారు. మరోవైపు షుగర్ వ్యాధిగ్రస్తులు(Diabetics) ఈ అరటి పండ్లను తినాలో వద్దానని ఆలోచిస్తూ ఉంటారు. షుగర్ ఉన్నవారు అరటి పండు తినొచ్చని కొందరు సలహా ఇస్తే ఇంకొందరు మాత్రం రోజుకో అరటి పండు తింటే మంచిదని సూచిస్తుంటారు.
అరటిపండు(Banana Fruit)లో అనేక పోషకాలు ఉన్నాయి. పొటాషియం, ఫైబర్, విటమిన్లు, కార్బొహైడ్రేట్లు వంటివి అరటిలో పుష్కలంగా ఉంటాయి. అరటి పండ్ల వల్ల శరీరంలో తక్షణమే శక్తి లభిస్తుంది. అరటిలో ఉండే సహజ సిద్ధ చక్కెరలు రక్తంలోని గ్లూకోజ్(Glucose) స్థాయిలను పెంచుతాయి. కాబట్టి రోజుకో అరటి పండు(Banana Fruit) తీసుకోవడం వల్ల షుగర్ వ్యాధిగ్రస్తుల(Diabetics)కు పెద్ద నష్టమేమీ జరిగే అవకాశం లేదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
అరటిపండ్ల(Banana Fruit)ను కొంత మంది ఖాళీ కడుపుతో తింటూ ఉంటారు. అది మంచి పద్దతి కాదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అరటి పండులో అనేక రకాల పోషక పదార్థాలు ఉన్నాయి. అందులో ఆమ్లతత్వం కూడా ఉంది. ఖాళీ కడుపుతో అరటి పండు తింటే ఆమ్లతత్వం వల్ల ఎసిడిటీ(ACDT) పెరుగుతుంది. కాబట్టి అరటి పండు(Banana Fruit)తో పాటుగా ఉడకబెట్టిన కోడిగుడ్లు, బాదం, పిస్తా వంటి డ్రైఫ్రూట్స్ తీసుకోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.
శరీరంలో జీర్ణశక్తిని అరటి పండు పెంచుతుంది. ప్రతి అరటి పండులో మూడు గ్రాముల ఫైబర్(Fiber) అనేది ఉంటుంది. అంతేకాకుండా అరటి పండులో మెగ్నీషియం కూడా ఎక్కువగా ఉంది. అరటి పండ్ల(Banana Fruit)ను ఎక్కువగా తింటే మెగ్నిషియం ఎక్కువగా పెరిగిపోయే అవకాశం ఉంది. రక్తంలో మెగ్నిషియం, కాల్షియం విలువల మధ్య తేడా వస్తే గుండె సంబంధిత సమస్యలు(Heart Problems) కూడా వచ్చే అవకాశం ఉందని, అందుకే అరటి పండ్ల(Banana Fruit)ను అతిగా తినొద్దని వైద్యులు సూచిస్తున్నారు.