video viral : ఆనంద్ మహీంద్రాను ఆకట్టుకున్న వీడియో వైరల్ ..!
పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) సోషల్ మీడియాలో చురుకుగా ఉంటూ తరచూ ఆలోచన రేకెత్తించే వీడియోలు, పోస్ట్‌లు (Viral Video) షేర్ చేస్తుంటారు. టెక్ కంటెంట్ క్రియేటర్ ధనంజయ్ పోస్ట్ చేసిన వీడియోను ఆనంద్ మహీంద్రా షేర్ చేశారు. ముంబైలో (Mumbai) ఈ వీడియోను రికార్డు చేయగా బ్రిడ్జి కింద ఉన్న ఖాళీ ప్రదేశాన్ని వినియోగించుకున్న తీరును ఇది వెల్లడించింది.
పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) సోషల్ మీడియాలో చురుకుగా ఉంటూ తరచూ ఆలోచన రేకెత్తించే వీడియోలు, పోస్ట్‌లు (Viral Video) షేర్ చేస్తుంటారు. టెక్ కంటెంట్ క్రియేటర్ ధనంజయ్ పోస్ట్ చేసిన వీడియోను ఆనంద్ మహీంద్రా షేర్ చేశారు. ముంబైలో (Mumbai) ఈ వీడియోను రికార్డు చేయగా బ్రిడ్జి కింద ఉన్న ఖాళీ ప్రదేశాన్ని వినియోగించుకున్న తీరును ఇది వెల్లడించింది. ఈ స్పేస్‌లో పలువురు క్రికెట్, బాస్కెట్‌బాల్ ఆడుతుండటం కనిపించింది. బాల్ ఇక్కడనుంచి ఎగిరిపడకుండా నెట్‌తో కవర్ చేయడంతో పిల్లలు కూడా సేఫ్‌గా ఆడుకునే ఏర్పాట్లు చేశారు. ఈ ఫెసిలిటీ (facility) బావుందని, ఇలాంటివి మరిన్ని నగరాల్లో ఏర్పాటు చేయాలని ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) విజ్ఞప్తి చేశారు. ప్రభావవంతమైన మార్పు..ప్రతి నగరంలో ఇవి ఏర్పాటు చేయాలని పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చారు. స్పేస్‌ను సమర్ధంగా వినియోగించుకునేందుకు ఇది బ్రిలియంట్ ఐడియా (Brilliant idea) అని పలువురు యూజర్లు కామెంట్ చేయగా ఓవర్ బ్రిడ్జి ప్రాంతంలో ట్రాఫిక్ అధికంగా ఉంటుందని, ట్రాఫిక్‌ను దాటుకుని పిల్లలు అక్కడికి రావడం ప్రమాదకరమని మరికొందరు యూజర్లు రాసుకొచ్చారు.