వైద్యుల నిర్లక్ష్యంతో ఓ యువకుడు కడుపులో కత్తితో 5 ఏళ్లుగా బాధ పడుతున్నాడు. ఎన్ని ఆసుపత్రులు తిరిగినా, ఎన్ని మాత్రలు వేసినా తగ్గలేదు. ఇటీవల ఓ ప్రమాదానికి గురికావడంతో ఆసుపత్రిలో స్కానింగ్ తీసిన డాక్టర్లు కత్తిని చూసి షాక్ తిన్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్‌గా మారింది.
A young man in Gujarat had a knife in his stomach for 5 years. Doctors are shocked
Viral News: వైద్యో నారాయణో హరి అన్నారు. ప్రాణాలు రక్షించాల్సిన వైద్యులే తమ నిర్లక్ష్యంతో రోగుల ప్రాణాల మీదికి తెచ్చిన ఘటనలు ఎన్నో చూశాము. ఆపరేషన్లు చేసిన తరువాత కడుపులో కత్తెర్లు మరిచిపోయిన వార్తలు విన్నాం. అలాంటి ఘటనే గుజరాత్(Gujarat)లో వెలుగు చూసింది. ఓ పేషెంట్ కడుపులో కత్తి(knife) ఉంది. అది ఈ నాటిది కాదు. దాదాపు 5 ఏళ్ల నాటిది. ప్రమాదం జరిగి ఆసుపత్రికి వచ్చిన సదరు పేషెంట్‌ను పరిశీలించిన వైద్యులు స్కానింగ్ చేశారు. కడుపులో కత్తి చూసి ఖంగు తిన్నారు. ఈ ఘటన గుజరాత్ లోని భరుచ్ జిల్లా అంకాలేశ్వర్ లో వెలుగు చూసింది. స్థానికంగా ఉండే అతుల్ గిరి అనే వ్యక్తి కడుపులో కత్తిని ఉంచుకుని గత ఐదేళ్లుగా నరకం చూశాడు.
అతుల్ 5 ఏళ్ల క్రితం ఓ గొడవలో కత్తిపోట్లకు గురయ్యాడు. బంధువులు అతన్ని భరూచ్ సివిల్ ఆస్పత్రిలో చేర్పించారు. పరీక్షించిన వైద్యులు అతడికి ఆపరేషన్ చేసి కుట్లు వేసి ఇంటికి పంపించారు. ఆ తర్వాత కొద్ది రోజులకి అతనికి కడుపులో నొప్పి మొదలయ్యింది. దాంతో ఆసుపత్రికి వెళ్లాడు. వైద్యులు పెయిన్ కిల్లర్స్ ఇచ్చి పంపించారు. అలా నొప్పి వచ్చినప్పుడల్లా మందులు వాడుతూ ఐదు సంవత్సరాలు గడిపాడు. ఇటీవల అతుల్ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. దాంతో అతన్ని ఓ ప్రయివేటు హాస్పిటల్‌కు తరలించారు. చికిత్స పూర్తి అయిన తరువాత అతని కడుపు నొప్పి విషయం గురించి వైద్యులతో చెప్పాడు అతుల్. దీంతో ఎక్స్‌రే తీసిన డాక్టర్లు షాక్ అయ్యారు. కడుపులో కత్తి ఉందని చెప్పారు. దాన్ని బయటికి తీస్తామని చెప్పారు. గతంలో కూడా హరియాణాలోని కర్నాల్‌కు చెందిన 30 ఏళ్ల యువకుడి పొట్టలో ఆరు అంగుళాల కత్తిని గుర్తించారు. ఎయిమ్స్ వైద్యులు ఆపరేషన్ చేసి బయటకు తీశారు.