»A Woman Farmer Who Grows Pink Melons Surprises Everyone
Gujarat : పింక్ సీతాఫలాన్ని పెంచి… అందరినీ ఆశ్చర్యపరుస్తున్న మహిళా రైతు
గుజరాత్(Gujarat)... సౌరాష్ట్రలోని చాలా మంది రైతులు ఇప్పుడు ప్రయోగాల వ్యవసాయంపై ఆసక్తి చూపుతున్నారు. కొత్త రకాల పండ్లు, కూరగాయల్ని అభివృద్ధి చేస్తున్నారు. మరోవైపు ఆదాయం బాగా పెరిగేలా చేసుకుంటున్నారు. గులాబీ రంగు సీతాఫలాన్ని పెంచి... అందరినీ ఆశ్చర్యపరుస్తున్న విసవదర్ తాలూకా మహిళా రైతు కథ ఇది.
భారతదేశంలో విచిత్రమైన, ప్రయోగాత్మక పంటలు వేసేవారిలో గుజరాత్(Gujarat) రైతులు ముందుంటారు. ప్రపంచంలో అందరికీ దాదాపు సీతాఫలం పండు తెలుసు కానీ ఈ ఎరుపు సీతాఫలం లేదా షుగర్ ఆపిల్, గ్రీన్ కలర్ రకరకాల పేర్లు ఉన్నాయి. తాజాగా సౌరాష్ట్రలో… పింక్ సీతాఫలాలు (Pink melons) ప్రజలను ఆశ్చర్యపరుస్తున్నాయి. గతేడాది యూపీ (UP) కి చెందిన ఓ విద్యార్థి… ప్రయోగాత్మకంగా గులాబీ రంగు పుట్టగొడుగుల్ని(Mushrooms) పెంచి విజయం సాధించాడు. ఇప్పుడు గుజరాత్లోని పింక్ సీతాఫలం గురించి తెలుసుకుందాం.మోన్పరి గ్రామానికి చెందిన వర్షాబెన్ ఝలావాడియా 12వ తరగతి వరకు చదివి నాలుగేళ్లుగా వ్యవసాయం చేస్తోంది. ఆమె తన పొలంలో సీతాఫలాన్ని పండించడంలో ప్రయోగాలు చేసింది. గులాబీ రంగు సీతాఫలాన్ని పండించి ఫేమస్ అయ్యింది.
కరోనా కాలంలో సమయాన్ని సద్వినియోగం చేసుకుని.. పింక్ సీతాఫలం తోటను అభివృద్ధి చేయడం ప్రారంభించానని వర్షాబెన్ (Varshaben) తెలిపింది. వర్షాబెన్కి 9 ఎకరాల భూమి ఉంది. అందులోనే సూపర్ గోల్డెన్ (Super Golden) సీతాఫలం, పింక్ సీతాఫలం తోటలు వేసింది. ఆమెకు 3 ఆవులు ఉన్నాయి. అలాగే… పూల మొక్కలు కూడా పెంచుతోంది. మొదటి సంవత్సరంలోనే వర్షాబెన్ సీతాఫలాలు, నర్సరీ ద్వారా రూ.1.50 లక్షలు సంపాదించింది.వర్షాబెన్కి ఆమె భర్త, పిల్లలు, అత్తగారు కూడా నాలుగేళ్లుగా పూలతోట పనిలో సహాయం చేస్తున్నారు. వాణిజ్య పంటలు దీర్ఘకాలికంగా ఆదాయాన్ని ఇస్తాయని ఆమె తెలిపింది.వర్షాబెన్ తన 9 ఎకరాల భూమిలో ప్రస్తుతం 65 రకాల మామిడి, 18 పనసచెట్లు, 6 జామ, 5 లీచీ, చెర్రీ పంటలు వేసి నష్టపోకుండా జాగ్రత్తగా వ్యవసాయం చేస్తోంది.సీతాఫలం తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి వరల్డ్ వైడ్ వెబ్(World Wide Web)లో చాలా సమాచారం ఉంది. ఇందులో మెగ్నీషియం మరియు విటమిన్ B6 పుష్కలంగా ఉన్నాయి. ఇది హోమోసిస్టీన్ (Homocysteine) అనే అమైనో ఆమ్లాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది, ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది.