Car Driver Account: అప్పుడప్పుడు డబ్బులు మిస్టేక్‌గా జమ అవుతాయి. తర్వాత సదరు బ్యాంక్ సిబ్బంది ఫోన్ చేసి, అమౌంట్ పంపించాలని కోరుతుంటారు. అలాంటి ఘటన తమిళనాడులో జరిగింది. ఆ కారు డ్రైవర్ ఖాతాలో వెయ్యి, లక్ష రూపాయలో జమ కాలేదు. అక్షరాల రూ.9 వేల కోట్లు క్రెడిట్ అయ్యాయి. ఆ మేసెజ్ చూసి ఆశ్చర్యపోవడం అతని వంతయ్యింది. తర్వాత ఓ స్నేహితుడికి కొంత నగదు ట్రాన్స్ఫర్ చేయగా.. నగదు క్రెడిట్ అయ్యింది. దీంతో తెగ సంతోష పడ్డాడు. తనకు లాటరీ ఏమైనా తగిలిందా అని హ్యాపీగా ఉన్నాడు.
సంతోషం.. అంతలోనే
ఆటో డ్రైవర్ సంతోషం ఎంతో సేపు నిలువలేదు. తర్వాత బ్యాంక్ అధికారుల నుంచి రాజ్‌కుమార్‌కు ఫోన్ వచ్చింది. ఆ నగదు పొరపాటున జమ అయ్యిందని చెప్పారు. వెంటనే తమకు ట్రాన్స్ఫర్ చేయాలని కోరారు. డ్రైవర్ రాజ్ కుమార్ కాస్త తెలివిగా వ్యవహరించాడు. బ్యాంక్ అధికారుల వద్దకు తన లాయర్‌ను పంపించాడు. బ్యాంక్ అధికారులతో వారు సంప్రదింపులు జరిపారు. చివరకు ఇద్దరు మధ్య రాజీ కుదిర్చారు.
కారు నడుపుతూ
చెన్నైలో రాజ్ కుమార్ కారు నడుపుకుంటాడు. ఈ నెల 9వ తేదీన తమిళనాడుకు చెందిన మర్కెంటైల్ బ్యాంక్ నుంచి మేసెజ్ వచ్చింది. రూ.9 వేల కోట్ల నగదు జమ అయినట్టు చూపించింది. మొదట్లో నమ్మ లేదు. సరే నగదు ఉంది కదా అని.. రూ.21 వేలను తన స్నేహితుడికి ట్రాన్స్ఫర్ చేశాడు. డబ్బులు వెళ్లడంతో ఆశ్చర్య పోయాడు. ఆ మనీ తనకే అని ఊహాల లోకంలో విహరించాడు. వెంటనే బ్యాంక్ అధికారుల నుంచి ఫోన్ వచ్చింది. ఆ నగదు పొరపాటున జమ అయ్యిందని.. స్నేహితుడికి పంపిన రూ.21 వేలతోపాటు మొత్తం అమౌంట్ తిరిగి పంపించాలని కోరారు.
బ్యాంక్ అధికారుల వద్దకు లాయర్లు
రాజ్ కుమార్ తన లాయర్లను సంప్రదించాడు. వారు బ్యాంక్ అధికారులతో మాట్లాడారు. రూ.21 వేల నగదు వెనక్కి ఇవ్వాల్సిన పనిలేదని స్పష్టంచేశారు. అలాగే మిగతా నగదు పంపించిన తర్వాత వెహికిల్ లోన్ ఇస్తామని బ్యాంక్ అధికారులు హామీనిచ్చారు. దీంతో నగదు బదిలీ జరిగి సమస్య పరిష్కారం అయ్యింది. లేదంటే కోర్టు వరకు వెళ్లి ఇష్యూ పెద్దది అయ్యేది. రాజ్ కుమార్ నగదు పంపించేందుకు ఓకే చెప్పడంతో బ్యాంక్ అధికారులు/ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. లేదంటే తప్పు చేసిన సిబ్బందికి పెద్ద శిక్షే పడాల్సి ఉండేది.
రూ.21 వేలు ట్రాన్స్ఫర్
రాజ్ కుమార్ ఖాతాలో భారీ నగదు జమ కాగా.. నిజమో కాదో తెలుసుకునేందుకు రూ.21 వేలను బదిలీ చేశాడు. తర్వాత న్యాయవాదులతో మాట్లాడించాడు. ఆ నగదు వదిలి, వెహికిల్ లోన్ ఇస్తామని చెప్పడంతో.. డబ్బులు తిరిగి ఇచ్చేందుకు రాజ్ కుమార్ అంగీకరించాడు. దీంతో బ్యాంక్ అధికారులతో గొడవ సద్దుమణిగింది. అంతా రిలాక్స్ అయ్యారు. రాజ్ కుమార్ మాత్రం కాసేపు కోటీశ్వరుడిలా ఫీల్ అయ్యాడు. ఆ డబ్బు తనకే ఉంటుందని.. ఏం చేయాలా అని ఆలోచించాడు. ఇంతలోనే సీన్ రివర్స్ అయ్యింది.