పాములు(Snakes) చూస్తే ఎవ్వరికైనా భయమే. అలాంటి పాములు ఒకేసారి ఐదారు కనిపిస్తే ఇంకేమైనా ఉందా. ఈ షాకింగ్ ఘటన(Shocking Insident) మహారాష్ట్రలోని గోండియాలో చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తన ఇంటిని శుభ్రం చేస్తుండగా పాములు బయటపడ్డాయి. సీతారామశర్మ అనే వ్యక్తి తన ఇంటిలోని దర్వాజాకు చెదలు(Worms) పట్టాయని క్లీన్ చేయించాలనుకున్నాడు. అందుకోసం ఓ వ్యక్తిని పనికి పెట్టాడు. అతను ఆ దర్వాజాకు పట్టిన చెదలను క్లీన్ చేస్తుండగా అవి చెదలు కాదని పాములని గుర్తించి షాక్ అయ్యారు.
డోర్ ఫ్రేమ్ నుంచి బయటపడిన పాముల వీడియో:
డోర్ ఫ్రేమ్ నుంచి ఏకంగా 39 పాములు(Snakes) కనిపించడంతో సీతారామశర్మ స్నేక్ క్యాచర్స్ (Snake Catchers)కు కాల్ చేసి విషయం చెప్పాడు. వెంటనే ఇద్దరు స్నేక్ క్యాచర్స్ ఇంటికి వచ్చి పాములు పట్టే పనిలో పడ్డారు. నాలుగు గంటల సమయంలో వారు 39 పాములను పట్టారు. ఆ ఇంటిని 20 ఏళ్ల క్రితం నిర్మించినట్లు సీతారామశర్మ తెలిపాడు. తలుపు ప్రేమ్ (Door Frames)ను చెదపురుగులు తినేశాయని, ఆ చెద పురుగులను తినేందుకు పాము వచ్చి చేరినట్లు స్నేక్ క్యాచర్స్ గుర్తించారు.
డోర్ ఫ్రేమ్ (Door Frame)లో పదుల సంఖ్యలో పాములు(Snakes) ఉంటాయని స్నేక్ క్యాచర్స్ ఊహించలేదు. పట్టకారు సాయంతోటి పాములను పట్టి ఓ ప్లాస్టిక్ జార్ లో వాటిని ఉంచారు. ఆ తర్వాత ఆ పాములను ఓ ప్లాస్టిక్ జార్ లో వేసి వాటిని సురక్షిత అటవీ ప్రాంతంలో వదిలిపెట్టినట్లు స్నేక్ క్యాచర్స్(Snake Catchers) తెలిపారు.
ఇంట్లో డోర్ ఫ్రేమ్ వద్ద దొరికిన పాములు(Snakes) విషపూరితమైనవి కావని స్నేక్ క్యాచర్(Snake Catchers) బంటి శర్మ వెల్లడించాడు. డోర్ ఫ్రేమ్ లో చేరిన పాములు చెదపురుగులను ఆహారంగా తీసుకుంటూ బతుకుతున్నాయని తెలిపాడు. దొరికిన పాములన్నీ కూడా వారం రోజుల క్రితమే పుట్టినట్లు స్నేక్ క్యాచర్లు తెలిపారు. ఈ పాముల వల్ల ఎటువంటి ప్రాణ హాని లేదని వివరించారు.