కల్తీ మద్యం తాగి ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటన తమిళనాడులోని విల్లుపురంలో జరిగింది. శనివారం సాయంత్రం ఎక్కియార్ కుప్పం ఫిషింగ్ హామ్మెట్ లో స్థానికంగా తయారు చేసిన లిక్కర్ ను సేవించారు. ఇందులో ముగ్గురు మరణించగా 11మంది ఆస్పత్రిపాలయ్యారు. వీరిని జవహర్లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (జిప్మర్)లో అడ్మిట్ చేశారు. ఆదివారం తెల్లవారుజామున మద్యం సేవించిన వారు వాంతులు చేసుకున్నారని అధికారులు తెలిపారు. కల్తీ మద్యం తయారు చేస్తుండటంతో ఎక్కియార్ కుప్పం గ్రామ సమీపంలో పోలీసులు దాడులు నిర్వహించారు. చనిపోయిన వారిలో శంకర్ (50), సురేష్ (60), దరాణివేల్ (50)గా గుర్తించారు. శనివారం రాత్రి, ఆదివారం తెల్లవారుజామున వాంతులు చేసుకోవడంతో మరో 15 మంది అదే ఆసుపత్రిలో చేరారు.
విల్లుపురం జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఎన్.శ్రీనాథ ఐఎఎన్ఎస్తో మాట్లాడుతూ స్థానికంగా తయారుచేసిన మద్యం సేవించి వాంతులు చేసుకుంటున్నట్లు తమకు ఫిర్యాదులు అందినట్లు చెప్పారు. వెంటనే విచారణ ప్రారంభించినట్లు చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి మరికొందరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిపారు. ఎక్కియార్కుప్పం గ్రామ సమీపంలోని మరక్కనం ప్రాంతంలోని కొన్ని గ్రామాల్లో దాడులు నిర్వహించారు.